AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తినుబండారాలను అమ్మడానికి వెళ్లి ఇంటికి రాని వ్యక్తి.. వెళ్లి చూసేసరికి షాక్!

బీహార్‌లో పోలీసులు కూడా నివ్వెరపోయేంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దుండగులు ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చి, తల మొండెం వేరు చేసి, తలను తమతో తీసుకెళ్లారు. సహర్సా జిల్లాలో జరిగిన ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నేరస్థుల కోసం వెతకడం ప్రారంభించారు.

తినుబండారాలను అమ్మడానికి వెళ్లి ఇంటికి రాని వ్యక్తి.. వెళ్లి చూసేసరికి షాక్!
Bihar Crime News
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 13, 2025 | 1:53 PM

బీహార్‌లో పోలీసులు కూడా నివ్వెరపోయేంత దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. దుండగులు ఓ వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చి, తల మొండెం వేరు చేసి, తలను తమతో తీసుకెళ్లారు. సహర్సా జిల్లాలో జరిగిన ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నేరస్థుల కోసం వెతకడం ప్రారంభించారు.

శనివారం(ఏప్రిల్ 12) అర్థరాత్రి, పటార్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గోల్మా వెస్ట్ వార్డ్-12 నివాసి అయిన 50 ఏళ్ల నిర్మల్ సాహ్‌ను గోల్మా ఫోర్సాహా రోడ్డులో పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు దుండగులు. ఆ తరువాత అతని తలను నరికి తమతో తీసుకెళ్లారు. ఈ దారుణ హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

సమాచారం ప్రకారం, నిర్మల్ సాహ్ ప్రతిరోజూ తన బండిపై ఫాస్ట్ ఫుడ్ అమ్మడానికి పంచాయతీ పరిధిలోని అనేక గ్రామాలు తిరుగుతూ సాయంత్రం ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలోనే శనివారం, నిర్మల్ సాహ్ తన బండితో ఫాస్ట్ ఫుడ్ అమ్మడానికి వెళ్ళాడు. సాయంత్రం ఆలస్యంగా తిరిగి వస్తుండగా, గోల్మా ఫోర్సాహా రోడ్డులోని చును సాహ్ ఇసుక, కంకర డిపోకు దక్షిణంగా ఉన్న నిర్జన రహదారిపై బండి బోల్తా పడిన ఉన్నట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకునిసరికి, నిర్మల్ సాహ్ గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

సంఘటన స్థలంలో మొండెం మాత్రమే పడి ఉంది. తల కనిపించలేదు. సంఘటన స్థలానికి సమీపంలోని నిర్జన రహదారికి ఇరువైపులా మొక్కజొన్న తోటల్లో వెతికారు. అయిన ఫలితం లేదు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పతార్‌ఘాట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, హత్య చేసి, దుండుగులు అదృశ్యం చేసిన తల కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు ఈ సంఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య జరిగినప్పటి నుండి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..