AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది విన్నారా..? ఇండియా నుంచి 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్స్‌ ఎగుమతి! అది కూడా..

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ ఇండియా ఐఫోన్ ఉత్పత్తి 60 శాతం పెరిగి, దాదాపు రూ.1.89 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేశారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు ఈ ఎగుమతుల్లో ప్రధాన పాత్ర పోషించాయి.

ఇది విన్నారా..? ఇండియా నుంచి 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్స్‌ ఎగుమతి! అది కూడా..
Iphones
Follow us
SN Pasha

|

Updated on: Apr 13, 2025 | 3:17 PM

మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ ఇండియా ఐఫోన్ ఉత్పత్తిలో 60 శాతం పెరుగుదలను నమోదు చేసి, దాదాపు రూ.1.89 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ మొత్తం ఉత్పత్తిలో 2024-25లో ఆపిల్ ఇండియా నుండి రూ.1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసిందని ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ వార్‌ నడుతస్తున్న తరుణంలో ఇండియాలో ఐఫోన్స్‌ ప్రొడక్షన్‌ను ఆపిల్ మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ఫలితంగా చైనా నుంచి అమెరికాకు ఐఫోన్స్‌ ఎగుమతులు తగ్గుతాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు భారీ సుంకాలు విధించడంతో వాటిని తప్పించుకోవడానికి ఆపిల్‌ ఇండియాలో ఉత్పత్తి పెంచింది.

2024-25 (ఏప్రిల్-ఫిబ్రవరి) 11 నెలల్లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రూ. 1.75 లక్షల కోట్లు ($ 21 బిలియన్లు) దాటాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలిపింది. ఇది 2023-24 ఇదే కాలానికి సంబంధించిన సంఖ్య కంటే 54 శాతం ఎక్కువ. ఎగుమతుల్లో దాదాపు 70 శాతం తమిళనాడుకు చెందిన ఫాక్స్‌కాన్‌తో కలిసి ఆపిల్ ఐఫోన్ సరఫరా జరిగింది. ఇది విదేశీ ఎగుమతుల్లో దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ నుండి ఎగుమతులు 40 శాతానికి పైగా పెరిగాయి. మరో 22 శాతం ఎగుమతులు ఐఫోన్ విక్రేత టాటా ఎలక్ట్రానిక్స్ నుండి వచ్చాయి.

మరో 12 శాతం తమిళనాడులోని పెగాట్రాన్ నుండి వచ్చాయి, దీనిలో జనవరి చివరి నాటికి టాటా ఎలక్ట్రానిక్స్ 60 శాతం వాటాను కొనుగోలు చేసింది. రెండు తైవాన్ కంపెనీల కొనుగోలుతో, టాటా గ్రూప్ దేశంలో ఐఫోన్‌ల ప్రధాన ఉత్పత్తిదారుగా ఉద్భవించింది. ఇండియా నుండి మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ 20 శాతం వాటాను కలిగి ఉంది. 2024-25లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 20 బిలియన్ డాలర్లు (రూ. 1.68 లక్షల కోట్లు) చేరుకుంటాయని వైష్ణవ్ ముందుగానే అంచనా వేశారు. 11 నెలల్లోనే ఆ అంచనాలు నిజం అయ్యాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆరోగ్యం, డబ్బు, శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం
ఆరోగ్యం, డబ్బు, శాంతి లేకపోతే మీ ఇంట్లో ఈ సమస్య ఉందని అర్థం
ఈ పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు..!
ఈ పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 12వేల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 12వేల పోలీసు ఉద్యోగాలకు ప్రకటన
ఇలా ఈజీగా మీ గ్యాస్ బర్నర్‌ ను కొత్త దానిలా మెరిపించండి..!
ఇలా ఈజీగా మీ గ్యాస్ బర్నర్‌ ను కొత్త దానిలా మెరిపించండి..!
షోయబ్ అక్తర్ ఛానల్‌కు ఇండియా షాక్.. పూర్తిగా బ్లాక్!
షోయబ్ అక్తర్ ఛానల్‌కు ఇండియా షాక్.. పూర్తిగా బ్లాక్!
పుచ్చకాయతో టేస్టీ టేస్టీ డ్రింక్స్ తయారు చేసుకోండి రెసిపీ మీకోసం
పుచ్చకాయతో టేస్టీ టేస్టీ డ్రింక్స్ తయారు చేసుకోండి రెసిపీ మీకోసం
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు
ఎయిర్ కూలర్ ను ఏసీలా మార్చేయొచ్చు.. ఈ టెక్నిక్ తెలుసా?
ఎయిర్ కూలర్ ను ఏసీలా మార్చేయొచ్చు.. ఈ టెక్నిక్ తెలుసా?
తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి!
తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి!
పుట్టగొడుగులను లొట్టలేసుకుని తింటున్నారా? చాలా డేంజర్‌..
పుట్టగొడుగులను లొట్టలేసుకుని తింటున్నారా? చాలా డేంజర్‌..