Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో
Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు కాశ్మీర్ పోలీసులు శనివారం ఉదయం వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని ఓ ఉగ్రవాది హతమైనట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. మరణించిన ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున రాజౌరి జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతోపాటు సాంబా జిల్లాలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
నిఘావర్గాల సమాచారం మేరకు.. బుద్గాంలోని సర్థియాన్ గ్రామంలో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ సమయంలో రెండు పిస్టల్స్, ఐదు మ్యాగజైన్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. పూంచ్ బాల్నోయల్ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్‌లో భద్రతా దళాలకు రెండు వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్లు, బ్యాటరీలు, టార్చ్‌లు సైతం లభించినట్లు అధికారులు తెలిపారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో ఉగ్రమూకలు దాడులకు పాల్పడేందుకు రిచిస్తున్న ప్రణాళికలను భద్రతా బలగాలను తిప్పికొడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దుల్లో గస్తీని సైతం ముమ్మరం చేశాయి.
Also Read: