AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: పాఠశాల హెడ్‌ మాస్టర్ పాడుబుద్ధి.. వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన నర్స్‌తో..

Headmaster Thrashed: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను మరింత

Crime: పాఠశాల హెడ్‌ మాస్టర్ పాడుబుద్ధి.. వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన నర్స్‌తో..
Headmaster Thrashed To Health Worker
Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2021 | 7:33 AM

Share

Headmaster Thrashed: దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను మరింత విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ వర్కర్ పట్ల ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా అశ్లీల సందేశాలను సైతం పంపించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన బెళగావిలోని దేగాం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ మహిళా ఉద్యోగిని గత రెండు వారాలుగా ప్రభుత్వ పాఠశాలలో 18 ఏళ్లు పైబడిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్లు అందిస్తోంది. ఈ క్రమంలో పాఠశాల హెచ్ఎం సురేష్‌ చావలాగి.. మహిళా ఉద్యోగిని సెల్‌ఫోన్‌ నంబర్‌ను తీసుకొని.. ప్రతిరోజు ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపుతూ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. దీంతో ఆమె.. అతన్ని పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ హెచ్ఎం అలానే వేధిస్తుండటంతో.. విసిగిపోయిన హెల్త్ వర్కర్.. బంధువులు, స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పి కన్నీరుమున్నీరయ్యింది.

దీంతో వారంతా ఆగస్టు 4న బుధవారం దేగాం ప్రభుత్వం పాఠశాలకు చేరుకున్నారు. హెచ్ఎం వచ్చిన అనంతరం ఛాంబర్‌కు చేరుకుని ఆ కీచకుడిని గదిలో బంధించి.. దేహశుద్ధి చేశారు. అయితే.. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అనంతరం హెచ్ఎంను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Simhachalam Lands Issue: సింహాచలం భూ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

కండోమ్ తేనందుకు మైనర్‌పై దాడి.. ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు