AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Condoms: దారుణం.. షాప్ లో కండోమ్స్ కొని తెచ్చివ్వలేదని మైనర్ పై దాడి..

కండోమ్ తేనందుకు మైనర్‌ను కత్తితో పొడిచాడు ఓ యువకుడు. చెప్పిన మాట వినలేదనే కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు..

Condoms: దారుణం.. షాప్ లో కండోమ్స్ కొని తెచ్చివ్వలేదని మైనర్ పై దాడి..
Attack On Minor Boy
Venkata Chari
|

Updated on: Aug 07, 2021 | 10:29 PM

Share

కండోమ్ తేనందుకు మైనర్‌ను కత్తితో పొడిచాడు ఓ యువకుడు. చెప్పిన మాట వినలేదనే కారణంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువకుడు మైనర్ అని చూడకుండా మాటలతో దూషించి, తీవ్రంగా గాయపరిచాడు. అప్పటికీ కోపం చల్లారకపోవడంతో ఏకంగా కత్తితో గాయపరిచాడు. పుణెలోని ఖరది ప్రాతంలో జరిగింది ఈ సంఘటన. చందన్నగర్ పోలీసుల వివరాల మేరకు.. పుణెలోని ఖరది ప్రాంతంలో నివసిస్తున్న ఓ 21 ఏళ్ల నీలేష్ వాగ్మారా అనే వ్యక్తి.. తుకాంరానగర్ నివాసి అయిన మైనర్ బాలుడు.. నీలేష్ వాగ్మారాను కలిసేందుకు తితివాడి ప్రాంతానికి వెళ్లాడు. కొద్దిసైపటి తరువాత నీలేష్ మైనర్ బాలుడికి కొంత డబ్బు ఇచ్చి, వైద్య కేంద్ర నుంచి కండోమ్‌లు కొని తెమ్మని పంపించాడు.

అయితే మైనర్ బాలుడు నిరాకరించినందుకు ఆగ్రహించిన నీలేష్.. బాలుడిని మాటలతో దూషించి, బాగా కొట్టాడు. ఇంకా కోపం తగ్గని ఆ యువకుడు దగ్గరలోని ఓ వాహనం నుంచి కత్తి తీసుకుని మైనర్ బాలుడిని పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. నీలేష్‌పై మైనర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం కింద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద నీలేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..

Tirupati Kidnap: తిరుపతి కిడ్నాప్‌ కథ సుఖాంతం… తల్లి చెంతకు చేరిన 4 నెలల బాలుడు..