కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..

Cell Phone Container Theft : కర్నాటక, కోలార్ జిల్లాలోని దేవరాయసముద్రం సమీపంలో సెల్ ఫోన్స్ కంటైనర్ దోపిడీ జరిగింది. సుమారు రూ.6 కోట్ల విలువైన ఎం.ఐ

కర్నాటకలో సెల్ ఫోన్స్ కంటైనర్ చోరీ.. 6 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు..
Robbery
Follow us

|

Updated on: Aug 06, 2021 | 9:38 PM

Cell Phone Container Theft : కర్నాటక, కోలార్ జిల్లాలోని దేవరాయసముద్రం సమీపంలో సెల్ ఫోన్స్ కంటైనర్ దోపిడీ జరిగింది. సుమారు రూ.6 కోట్ల విలువైన ఎం.ఐ మొబైల్స్‌ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. మొబైల్ లోడ్ తమిళనాడులోని కాంచీపురం నుంచి బెంగళూరుకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. సినీఫక్కీలో గుర్తు తెలియని వ్యక్తులు హైవేపై కంటైనర్ ను ఓవర్ టేక్ చేసి డ్రైవర్ పై దాడి చేశారు. కంటైనర్ ను హైజాక్ చేసి హైవేపై కొద్ది దూరం ప్రయాణం చేశారు. అనంతరం కంటైనర్ లోని రూ.6 కోట్ల విలువైన సెల్ ఫోన్స్ ను చోరీ చేసి వాహనాన్ని డ్రైవర్ కు అప్పగించి ఉడాయించారు. ఉత్తర భారత దేశానికి చెందిన దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీరియస్ ఇష్యూగా తీసుకున్న కోలార్ ఎస్పీ వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు టీం లను ఏర్పాటు చేశారు.

అయితే ఇది కంజర్ భట్ ముఠా పనేనని కొలార్ పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లా నగరి వద్ద ఇదే తరహా చోరీ జరిగింది. 2020 ఆగస్టు 26న చోరీకి గురైన మొబైల్స్ కంటైనర్ కేసును చిత్తూరు జిల్లా పోలీసులు 14 రోజుల్లో చేధించారు. మహారాష్ట్రలోని దేవాగ్ జిల్లా కు చెందిన కంజర్ భట్ ముఠా నుంచి అప్పట్లో 7 కోట్ల రుపాయల విలువైన మొబైల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2020 అక్టోబర్ 15 న ఇదే ముఠా క్రిష్ణగిరి వద్ద 40 కోట్ల రూపాయల విలువైన మొబైల్స్ కంటైనర్ దోపిడీ చేశారు. చోరీ చేసిన మొబైల్స్‌ను దుబాయ్ లోని మీనా బజార్‌లో అమ్మేసినట్లు తమిళనాడు పోలీసులు గుర్తించారు. అప్పట్లో కంజర్ భట్ ముఠా కాజేసిన మొబైల్స్ రికవరీ చేసే బాధ్యతనుు తమిళనాడు పోలీసులు ఎన్ఐఏకు అప్పగించారు.

రైతులకు గుడ్ న్యూస్..! విదేశీ కూరగాయాలకు పెరుగుతున్న డిమాండ్.. బ్రోకలి సాగుతో అధిక లాభాలు..

Corona Eta Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఈటా’ కేసు వెలుగులోకి..

Tirupati Kidnap: తిరుపతి కిడ్నాప్‌ కథ సుఖాంతం… తల్లి చెంతకు చేరిన 4 నెలల బాలుడు..

అతడు మిల్కాసింగ్ సోదరుడు.. కానీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు..