అతడు మిల్కాసింగ్ సోదరుడు.. కానీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు..

అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి మ్యాచ్ ఏ ఆటగాడికైనా చాలా ప్రత్యేకమైనది. అది బ్యాట్స్‌మెన్ కావొచ్చు లేదా బౌలర్ కావొచ్చు. అరంగేట్రం మ్యాచ్‌లో చిరస్మరణీయమైన

అతడు మిల్కాసింగ్ సోదరుడు.. కానీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు..
Ag Kripal Singh
Follow us
uppula Raju

|

Updated on: Aug 06, 2021 | 8:14 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి మ్యాచ్ ఏ ఆటగాడికైనా చాలా ప్రత్యేకమైనది. అది బ్యాట్స్‌మెన్ కావొచ్చు లేదా బౌలర్ కావొచ్చు. అరంగేట్రం మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా అతడు అందరి దృష్టిని ఆకర్షించాలనుకుంటాడు. అభిమానులు కొన్నిసార్లు తొలి మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా ఆ ఆటగాడిని చివరివరకు గుర్తుంచుకుంటారు. అయితే ఇతడు కూడా భారత క్రికెట్ జట్టు కోసం చారిత్రక, చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌ని ప్రారంభించిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అతడు ఎవరో కాదు మిల్కా సింగ్ సోదరుడు, టీం ఇండియా మాజీ క్రికెటర్ AG కృపాల్ సింగ్.

వాస్తవానికి ఈ రోజు మిల్కా సింగ్ పుట్టిన రోజు. అంటే 6 ఆగస్టు 1933 న మద్రాసులో జన్మించారు. తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బలమైన సెంచరీ సాధించిన అతికొద్ది మంది భారత క్రికెటర్లలో కృపాల్ సింగ్ ఒకరు. అతను 1955-56 సంవత్సరంలో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఏజీ కృపాల్ సింగ్ అజేయంగా 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేసినప్పటికీ అతను తన కెరీర్‌లో 422 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన AG కృపాల్ సింగ్ మొత్తం 14 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను 28.13 సగటుతో 422 పరుగులు చేశాడు. 15 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు అజేయంగా నిలిచాడు. తన కెరీర్‌లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు అజేయంగా 100 పరుగులు. ఈ 14 టెస్టుల్లో అతడు 10 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కి పంపించాడు. ఇది కాకుండా AG కృపాల్ సింగ్ 96 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లను ఆడాడు. 40.81 సగటుతో 4939 పరుగులు చేశాడు. 142 ఇన్నింగ్స్‌లలో 21 సార్లు అజేయంగా నిలిచాడు. 10 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అతని అత్యధిక స్కోరు 208 పరుగులు. అదే సమయంలో అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కూడా చాలా బౌలింగ్ చేశాడు. 96 మ్యాచ్‌లలో తన పేరు మీద 177 వికెట్లు తీయడంలో విజయం సాధించాడు.

మ్యాచ్‌కి ముందురోజు రాత్రంతా పేకాట ఆడాడు..! ఉదయాన్నే జరిగిన మ్యాచ్‌లో 485 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లాభాలకు మార్గాలు.. అయితే నిపుణుల సూచనలు అవసరం..

PMFBY Quiz Contest : ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్విజ్ పోటీలో పాల్గొనండి.. రూ.11000 గెలుచుకోండి..