మ్యాచ్‌కి ముందురోజు రాత్రంతా పేకాట ఆడాడు..! ఉదయాన్నే జరిగిన మ్యాచ్‌లో 485 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు..

సాధారణంగా ఏ క్రికెటర్ అయినా మ్యాచ్‌కి ముందురోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే మరునాడు మ్యాచ్‌లో రిఫ్రెష్‌గా హాజరై ఆడవచ్చని అనుకుంటాడు.

మ్యాచ్‌కి ముందురోజు రాత్రంతా పేకాట ఆడాడు..! ఉదయాన్నే జరిగిన మ్యాచ్‌లో 485 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు..
Andrew Stoddart
Follow us
uppula Raju

|

Updated on: Aug 06, 2021 | 7:52 PM

సాధారణంగా ఏ క్రికెటర్ అయినా మ్యాచ్‌కి ముందురోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాడు. ఎందుకంటే మరునాడు మ్యాచ్‌లో రిఫ్రెష్‌గా హాజరై ఆడవచ్చని అనుకుంటాడు. అయితే మ్యాచ్‌కి ముందురోజు నిద్రపోకుండా ఉండి రికార్డ్ స్కోరు సాధించిన ఆటగాడు కూడా ఉన్నాడు. అతడు రాత్రి నిద్ర పోకుండా కార్డ్స్ ఆడుతూ.. స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతూ గడిపాడు. ఆ పై మరునాడు ఫీల్డ్‌లోకి దిగి 485 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతటితో ఈ ఆటగాడు ఆగలేదు. ప్రపంచ రికార్డు చేసిన తర్వాత కూడా అతని శక్తి తగ్గలేదు. అనంతరం అతను టెన్నిస్ ఆడటానికి వెళ్ళాడు. స్నేహితులతో కలిసి భోజనం చేశాడు. తర్వాత సినిమా చూడటానికి థియేటర్ చేరుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అతడెవరో తెలుసుకోవాలని ఉందా..

అతడు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ స్టోడార్ట్. వాస్తవానికి ఇతడు స్టోయిస్‌కి వ్యతిరేకంగా హాంప్‌స్టెడ్ కోసం బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మరో ఓపెనర్ మార్షల్ ఆరు పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన బెష్కే, స్టోడార్ట్ ఒక గంటపాటు ఆడుతూ జట్టు స్కోరును 150 పరుగులకు చేర్చారు. బెష్కే 98 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. వెంటనే జట్టు స్కోరు మూడు వికెట్లకు 370 పరుగులు అయింది. ఇది కేవలం రెండున్నర గంటల ఆట. స్టోడార్ట్ 230 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తరువాత అతను అదే బ్యాటింగ్ శైలిని కొనసాగిస్తూ 485 పరుగులు చేశాడు. అది కూడా ఒక రోజులో. ఈ మ్యాచ్‌లో హాంప్‌స్టెడ్ 813 పరుగులు చేసింది. స్టోడార్ట్ 485 పరుగులలో 63 ఫోర్లు, 20 ట్రిపుల్స్, 36 డబుల్స్, 78 సింగిల్స్ ఉన్నాయి. అతను ఆరు గంటల పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు.

16 వేలకు పైగా పరుగులు, 278 వికెట్లు రైట్ ఆర్మ్ బ్యాట్స్‌మన్, రైట్ ఆర్మ్ బౌలర్ అయిన ఆండ్రూ స్టోడార్ట్ ఇంగ్లాండ్ కోసం 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 35.57 సగటుతో 996 పరుగులు చేశాడు. 30 ఇన్నింగ్స్‌లలో రెండుసార్లు అజేయంగా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 173 పరుగులు. కానీ బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే సాధించాడు. ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ 309 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 32.12 సగటుతో 16738 పరుగులు చేశాడు. 537 ఇన్నింగ్స్‌లో 16 సార్లు అజేయంగా నిలిచాడు. ఇందులో 26 సెంచరీలు, 85 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 221 పరుగులు కాగా అతను 257 క్యాచ్‌లు పట్టాడు. స్టోడార్ట్ 309 మ్యాచ్‌ల్లో 278 వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 67 పరుగులకు 7 వికెట్లు.

PMFBY Quiz Contest : ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్విజ్ పోటీలో పాల్గొనండి.. రూ.11000 గెలుచుకోండి..

“మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉంది.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి..” హైకోర్టులో మహిళ పిటిషన్

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..