IND vs ENG: ఆధిక్యంలో టీమిండియా.. తొలిటెస్టు ముగింపుపై నెలకొన్న ఉత్కంఠ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టు ముగింపుపై ఉత్కంఠ నెలకొంది. వర్షం కారణంగా గురువారం సగం రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా అలాంటి..
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రసవత్తరంగా సాగుతున్న తొలి టెస్టు ముగింపుపై ఉత్కంఠ నెలకొంది. వర్షం కారణంగా గురువారం సగం రోజు ఆట రద్దైన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. నేడు మ్యాచ్ ముగిసేసమయానికి టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 11.1 ఓవర్లలో 25/0 స్కోర్‌తో ఆడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ 11, డామ్ సిబ్లీ 9 వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడుతున్నారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లతో పడొట్టారు.
శుక్రవారం 125/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 153 పరుగులు చేసి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. తొలుత మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే వర్షంతో గంట పాటు ఆట ఆగిపోయింది. అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యాక రాహుల్, పంత్(25) నెమ్మదిగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగానే ఎదుర్కొన్నారు. దూకుడుగా ఆడే క్రమంలో కీపర్ రిషభ్ పంత్.. రాబిన్‌సన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 145/5గా నిలిచింది. అనంతరం శార్ధూల్ ఠాకూర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ జడేజా రాహుల్‌కితోడు ఐదో వికెట్‌కు 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి చేరుకుంది. అయితే, వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. ఇక చివర్లో మహ్మద్ షమి11, బుమ్రా 28 బౌండరీల వర్షం కురింపించి ఆధిక్యాన్ని వీలైనంత పెంచారు. దీంతో టీమిండియా 278 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం లభించింది.
That’s about it on Day 3⃣ of the first #ENGvIND Test at Trent Bridge!
Rain has cut short the day’s play, with England moving to 2⃣5⃣/0⃣ – trailing #TeamIndia by 7⃣0⃣ runs.
Scorecard ? https://t.co/TrX6JMzP9A pic.twitter.com/vNIfN11KqP
— BCCI (@BCCI) August 6, 2021
Also Read: అతడు మిల్కాసింగ్ సోదరుడు.. కానీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు..