KL Rahul: కేఎల్ రాహుల్, రాబిన్‌సన్‌ల మధ్య వాగ్వాదం.. వైరలవుతోన్న వీడియో
టీమిండియా, ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకపోయి మరీ బ్యాటింగ్ చేశాడు.
Viral Video: టీమిండియా, ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకపోయి మరీ బ్యాటింగ్ చేశాడు. రాహుల్‌ని ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి మాటల దాడికి కూడా దిగారు. రాహుల్ 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాబిన్‌సన్ మాటల యుద్దానికి దిగాడు. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ పంచుకోగా, నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. కేఎల్ రాహుల్ రిషబ్ పంత్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. ఆసమయంలో రాబిన్‌సన్ ఏదో అనుకుంటూ వెళ్లిపోతూ రాహుల్ భుజాన్ని తాకి మరీ వెళ్లాడు. దీనికి కేఎల్ రాహుల్ కూడా ఘటాగానే సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకపోయి మరీ బ్యాటింగ్ కొనసాగించాడు. 84 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ పెవిలియన్ చేరాడు. మూడో రోజు మ్యాచ్ ముగిసేసమయానికి టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 11.1 ఓవర్లలో 25/0 స్కోర్‌తో ఆడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్ 11, డామ్ సిబ్లీ 9 వికెట్ పడకుండా జగ్రత్తగా ఆడుతున్నారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లతో పడొట్టారు.
— Rishobpuant (@rishobpuant) August 6, 2021