Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో నేడే భారత్‌కు చివరిరోజు.. పతకాల సంఖ్య పెరిగేనా? భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పోటీ పడనున్న క్రీడాంశాలు నేటితో ముగియనున్నాయి. జులై 23న ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు మాత్రమే సాధించింది.
Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పోటీ పడనున్న క్రీడాంశాలు నేటితో ముగియనున్నాయి. జులై 23న ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు భారత్ ఐదు పతకాలు మాత్రమే సాధించింది. ఇందులో రెండు రజత పతకాలు ఉండగా, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్ నుంచి మీరాబాయి చాను, రెజ్లింగ్ నుంచి రవి దహియా రజత పతకాలు సాధించగా.. బాడ్మింటన్‌లో సింధు, హాకీ పురుషుల టీం, బాక్సింగ్ నుంచి లవ్లీనా కాంస్యాలు సాధించారు. అయితే, నేడు ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు చివరిరోజు. అయితే, పతకాలు వచ్చే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీంతో నేడు పతకాలు లభిస్తాయా లేదా అనేది చూడాలి. ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను పతకం సాధించగా, మరి చివరి రోజు ఎవరు పతకం అందించనున్నారో చూడాలి.
ముఖ్యంగా జావెలిన్ త్రోపై పతకం ఆశలు ఉన్నాయి. నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్ రౌండ్‌లో తొలిస్థానంలో నిలవడంతో ఫైనల్లో కచ్చితంగా మెడల్ గెలుస్తాడని భారత అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం తలపడనున్నాడు. అలాగే గోల్ఫ్‌లో భారత క్రీడాకారిణి అదితి అశోక్ పతకంపై ఆశలు అలాగే ఉన్నాయి.
శనివారం భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇలా ఉంది.
ఉదయం 4.17 గంటలకు: గోల్ఫ్: ఉమెన్స్ రౌండ్ 4 – దీక్షా సాగర్ ఉదయం 4.48 గంటలకు: గోల్ఫ్: ఉమెన్స్ రౌండ్ 4- అదితి అశోక్ (వాతావరణం అనుకూలించక గోల్ఫ్ ఆట రద్దయితే.. రెండోస్థానంలో ఉన్న అదితికి రజతం దక్కే అవకాశం) సాయంత్రం 3.55 గంటలకు: రెజ్లింగ్: పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ కాంస్య పతక పోరు- భజరంగ్ పూనియా సాయంత్రం 4.30 గంటలకు: అథ్లెటిక్స్: పురుషుల జావెలిన్ త్రో ఫైనల్- నీరజ్ చోప్రా
Final showdown for #IND at #Tokyo2020
With 3 sports to watch out for tomorrow, 7 August, let’s cheer loudly for #TeamIndia as the #Olympics nears its end#Cheer4India
Take a look? pic.twitter.com/9O8Qk0Dgon
— SAIMedia (@Media_SAI) August 6, 2021
Don’t miss out the last day action for #IND at #Tokyo2020 tomorrow.
Olympians @aditigolf, Diksha Dagar, @BajrangPunia and @Neeraj_chopra1 will continue their hunt for glory.
Let’s support them with #Cheer4India#Olympics #TeamIndia@PMOIndia @ianuragthakur @NisithPramanik pic.twitter.com/dcFy1czY6C
— SAIMedia (@Media_SAI) August 6, 2021
Also Read: కాంస్య పతకం సాధించిన హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి ప్రధాని మోదీ… వీడియో