Wrestling Bajrang: చేజారిన స్వర్ణం.. కాంస్యంపై ఆశలు ఇంకా సజీవం. రెజ్లింగ్ సెమీస్‌లో భారత్‌కు నిరాశ. భజరంగ్ ఓటమి..
Wrestling Bajrang: టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీస్‌లో పాల్గొన్న భజరంగ్ పునియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు స్వర్ణం పక్కా అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. పురుషుల రెజ్లింగ్ సెమీస్‌లో భారత్ ఓటమి పాలైంది. రెజ్లింగ్ 65 కిలోల విభాగం సెమీస్‌లో...
Wrestling Bajrang: టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ సెమీస్‌లో పాల్గొన్న భజరంగ్ పునియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌కు స్వర్ణం పక్కా అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. పురుషుల రెజ్లింగ్ సెమీస్‌లో భారత్ ఓటమి పాలైంది. రెజ్లింగ్ 65 కిలోల విభాగం సెమీస్‌లో భజరంగ్ పునియా పరాజయం ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి అజర్‌బైజాన్ రెజ్లర్ హాజీ చేతిలో 12-5 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే భారత్‌కు మరో పతకంపై మాత్రం ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సెమీస్‌లో ఓటమి పాలైన భజరంగ్ శనివారం కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు. మరి రేపు (శనివారం) జరగనున్న మ్యాచ్‌లో భజరంగ్ రాణించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేరుస్తాడో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రపంచ ఛాంపియన్ అజర్‌బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్‌లో భజరంగ్ 5-12 తేడాతో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన రెండు బౌట్లలో గెలిచిన భజరంగ్ స్వర్ణంపై ఆశలు చిగురించేలా చేశాడు. అయితే పోటాపోటిగా జరిగిన మ్యాచ్‌లో చివరకు ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ మొత్తం ఏక పక్షంగా సాగింది. క్వార్టర్ ఫైనల్ వరకు అద్భుత ఆటతీరును కనబరిచిన భజరంగ్ సెమీస్‌లో మాత్రం తన మ్యాజిక్ కొనసాగించలేకపోయాడు. తొలి రౌండ్‌లోనే ప్రత్యర్థి భజరంగ్‌పై ఆదిపత్యం కనబరిచాడు.
Also Read: Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్ నర్సుపై పేషెంట్ బంధువు లైంగిక దాడి