Hockey Womens Modi: తీవ్ర భావోద్వేగానికి గురైన ఇండియన్ హాకీ ఉమెన్ ప్లేయర్స్.. ఓదార్చిన ప్రధాని మోదీ..
Hockey Womens Modi: టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో శుక్రవారం జరిగి ఈ మ్యాచ్‌లో మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో ఓడిపోయింది. స్వల్ప తేడాతో పతకనాన్ని చేరాజ్చుకుంది....
Hockey Womens Modi: టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో శుక్రవారం జరిగి ఈ మ్యాచ్‌లో మహిళల హాకీ టీమ్ 3-4 తేడాతో ఓడిపోయింది. స్వల్ప తేడాతో పతకనాన్ని చేరాజ్చుకుంది. మొదట్లో టఫ్ ఫైట్‌ఇచ్చిన మహిళల టీమ్.. తర్వాత మాత్రం కాస్త తడబడింది. దీంతో బ్రిటన్ విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగో క్వార్టర్‌లో ఇండియన్ ప్లేయర్స్ సరైన తీరులో రాణించకపోవడంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మహిళల జట్టు ఓడినా.. దేశ ప్రజలతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటున్నారు.
#WATCH | Indian Women’s hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021
అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన బ్రిటన్‌కు మంచి పోటినిచ్చారని పొగుడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సైతం మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. మీ పోరాట పటిమ గొప్పది.. టోక్యో ఒలింపిక్స్‌లో మీరు సాధించిన విజయాలు.. మరింత మంది అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టేందుకు స్ఫూర్తినిస్తాయి అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక అంతటితో ఆగకుండా హాకీ మహిళల జట్టు ప్లేయర్స్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్లేయర్స్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. చేతుల్లోకి వచ్చిన విజయం దూరమవడంతో తీవ్రంగా కంటతడి పెట్టారు. అయితే మోదీ వారిని అనునయించి దేశం మీ గురించి గర్వపడుతుందంటూ వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆటను ప్రేమిస్తే ఇలాగే ఉంటుందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల హాకీ టీమ్ ఓడినా దేశ ప్రజల మనసులు మాత్రం గెలుచుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ముఖ్యమంత్రి చేత మాస్క్ తీసేయించిన మహిళ.. కృష్ణగిరి పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం..
Surakshabandhan: సురక్ష బంధన్‌కు విశేష స్పందన.. టీవీ 9 ఆధ్వర్యంలో ట్రక్ డ్రైవర్లకు ఉచిత వ్యాక్సిన్