Tirupati Kidnap: తిరుపతి కిడ్నాప్ కథ సుఖాంతం… తల్లి చెంతకు చేరిన 4 నెలల బాలుడు..
Tirupati Kidnap: తిరుపతిలో కలకలం రేపిన నాలుగు నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతంమైంది. ఈ నెల 2వ తేదీన తిరుపతిలో ఓ యాచకురాలి నాలుగు నెలల చిన్నారిని గుర్తితెలియని వ్యక్తి అపహరించారు. అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద సేద...
Tirupati Kidnap: తిరుపతిలో కలకలం రేపిన నాలుగు నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ నెల 2వ తేదీన తిరుపతిలో ఓ యాచకురాలి నాలుగు నెలల చిన్నారిని గుర్తితెలియని వ్యక్తి అపహరించారు. అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్ వద్ద సేద తీరిన గంగులమ్మ అనే యాచకురాలి నుంచి 4 నెలల మగబిడ్డను అపహరించారు. గంగులమ్మ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా మరో యాచకురాలే ఆ చిన్నారికి అపరహరించినట్లు అంచనాకు వచ్చారు.
కిడ్నాప్ చేసిన యాచకురాలను ఆశగా గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్టాటక, తమిళనాడులో సైతం వెతికారు. ఈ క్రమంలోనే శుక్రవారం మైసూరులో ఆశ జాడను కనుగొన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆశ చిన్నారిని తీసుకొని మైసూర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. చిన్నారితో పాటు.. ఆశను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలను పోలీసులు రేపు (శనివారం) మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఇలా కిడ్నాప్‌కు గురైన చిన్నారిని పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు.
Also Read: Rummy Online: మాయదారి రమ్మీ.. ఆ కుటుంబాన్ని మింగేసింది.. విషాద కథనం
Corona on Children: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల్లో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉండవు!