Online Game: ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా.? మీ కొంప కొల్లేరు అవుతుంది జాగ్రత్తా.!
Online Game: కరోనా పుణ్యామాని ఆన్‌లైన్ అనివార్యంగా మారింది. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల నుంచి స్కూలుకు వెళ్లే చిన్నారుల వరకు అంతా ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఇక అంతకు ముందు చిన్నారులకు ఫోన్ ఇవ్వడానికి...
Online Game: కరోనా పుణ్యామాని ఆన్‌లైన్ అనివార్యంగా మారింది. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల నుంచి స్కూలుకు వెళ్లే చిన్నారుల వరకు అంతా ఇంటర్‌నెట్‌ను వినియోగించుకోక తప్పని పరిస్థితులు వచ్చాయి. ఇక అంతకు ముందు చిన్నారులకు ఫోన్ ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన పేరెంట్స్ కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇవ్వక తప్పట్లేదు. అయితే చిన్నారులు ఫోన్‌ను కేవలం క్లాస్‌లు వినడానికే ఉపయోగిస్తున్నారా? మరేదానికైనా వాడుతున్నారా.. తెలుసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన పేరెంట్స్ అప్రమత్తతో ఉండాలని హెచ్చరిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ గోండా జిల్లాలోని ఓ గ్రామంలో 12, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఆన్‌లైన్ క్లాసెస్ కోసం పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. అయితే క్లాస్ విన్న తర్వాత కూడా చిన్నారులు ఫోన్‌ను వాడడం మొదలు పెట్టారు. తల్లి ఇంటి పనుల్లో బిజీగా ఉండడం, తండ్రి పనిపై బయటకు వెళ్లడంతో ఎంచక్కా స్మార్ట్ ఫోన్‌లో గేమ్స్ డౌన్‌లోడ్ చేసి ఆడడం మొదలు పెట్టారా ఇద్దరు అన్నాదమ్ములు. ఈ క్రమంలోనే ఫ్రీ ఫైర్ అనే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తెగ ఆడారు. ఆటలో భాగంగా ఓసారి రూ. 7వేలు, మరోసారి రూ. 90 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టి వారు ఏం చేశారనేగా..? ఆన్‌లైన్ గేమ్స్‌లో ఉండే ఆటలో డైమండ్స్, క్యారెక్టర్ల కోసం బట్టలు కొనుగోలు చేశారు. అయితే ఈ విషయం తెలియని వారు ఓ రోజు అకౌంట్‌లోని డబ్బులు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లారు. అయితే ఖాతాలో డబ్బులు లేవని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా పేరెంట్స్ షాక్ అయ్యారు. డబ్బులు ఏమయ్యాయని చూడగా ఆన్‌లైన్ గేమ్స్‌లో వాడేశారని తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.. అయితే గేమ్‌కు సంబంధించి ఆ లావాదేవీ సక్రమంగానే జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా ఆ తల్లిదండ్రులకు కొంత మేర ఆర్థిక సాయాన్ని చేస్తామని హామి ఇచ్చాడు. అలాగే స్థానికంగా ఉన్న కొందరు పేరెంట్స్‌ను పిలిపించుకుని స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న పిల్లలపై పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలని తెలిపారు. చూశారుగా మీరు కూడా మీ చిన్నారులకు స్మార్ట్ ఫోన్‌లు ఇస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలో.
Also Read: Hyderabad: కరోనాతో ఎస్సార్ నగర్ పీఎస్ హోంగార్డు మృతి.. పోలీసు శాఖలో కలవరం
Rajasekhar: విలన్‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..
Accident: ఓహ్ మై గాడ్.. ఇది అలాంటి ఇలాంటి యాక్సిడెంట్ కాదు.. భూమ్మీద నూకలు మిగిలి.. Watch Video