Accident: ఓహ్ మై గాడ్.. ఇది అలాంటి ఇలాంటి యాక్సిడెంట్ కాదు.. భూమ్మీద నూకలు మిగిలి.. Watch Video

Drunk And Drive: రోడ్డుపై ప్రయాణించేప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయాలను పెడచెవిన పెడుతూ...

Accident: ఓహ్ మై గాడ్.. ఇది అలాంటి ఇలాంటి యాక్సిడెంట్ కాదు.. భూమ్మీద నూకలు మిగిలి.. Watch Video
Accident Video
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 06, 2021 | 7:10 PM

Drunk And Drive: రోడ్డుపై ప్రయాణించేప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. అందుకే అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ విషయాలను పెడచెవిన పెడుతూ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓవైపు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోజూ వార్తలు వస్తున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇక కొందరైతే మద్యం తాగి మరీ వాహనాలు నడుపుతూ ప్రాణాలను గాల్లో దీపంగా మార్చేసుకుంటున్నారు. తాజాగా శంకర్‌ పల్లికి సమీపంలో ఉన్న దొంతపల్లి అనే గ్రామంలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ షాక్‌కు గురి చేస్తోంది.

దొంతపల్లి మెయిన్‌ రోడ్డుపై ఓ లారీ అవతలి రోడ్డువైపు వెళుతోంది. ఈ సమయంలో లారీకి ఎదురుగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై దూసుకొచ్చారు. అత్యంత వేగంగా వచ్చిన ఆ యువకులు ఎదురుగా లారీ రోడ్డును క్రాస్‌ చేస్తోందనన్న విషయాన్ని గమనించలేదు. అదే వేగంతో లారీని ఒక్కసారిగా ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. లారీ వేగంతో లేకపోవడం, వారికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలి ఉన్నాయేమో కానీ స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. ఇదంతా అక్కడే ఓ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ షాకింగ్ యాక్సిడెంట్‌ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బైక్‌ నడిపిస్తోన్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ఎదురుగా వస్తోన్న లారీని గమనించకుండా ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించకపోవడంతో తలకు గాయాలయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారు వేగంగా స్పందించరని, సరైన నిర్ణయం తీసుకోలేరని చెప్పడానికి ఈ ప్రమాదం మంచి ఉదాహరణ అని పోలీసులు వాహనదారులకు హితబోధ చేస్తున్నారు.

Also Read: “మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉంది.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి..” హైకోర్టులో మహిళ పిటిషన్

Car Care in Rain: వర్షంలో కారు అద్దంపై నీరు నిలిచిపోతోందా? ఇలా చేసి చూడండి..

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..