AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు గుడ్ న్యూస్..! విదేశీ కూరగాయాలకు పెరుగుతున్న డిమాండ్.. బ్రోకలి సాగుతో అధిక లాభాలు..

Broccoli Farming : ప్రస్తుతం దేశంలోని రైతులు వాణిజ్య పంటల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు.

రైతులకు గుడ్ న్యూస్..! విదేశీ కూరగాయాలకు పెరుగుతున్న డిమాండ్.. బ్రోకలి సాగుతో అధిక లాభాలు..
Broccoli Farming
uppula Raju
|

Updated on: Aug 06, 2021 | 8:48 PM

Share

Broccoli Farming : ప్రస్తుతం దేశంలోని రైతులు వాణిజ్య పంటల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు. కూరగాయల సాగు పెరగడానికి ఇదే కారణం. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటాలో దేశంలో ఉద్యాన పంటల ఉత్పత్తి బాగా పెరిగింది. రైతులు దాని నుంచి నేరుగా ప్రయోజనం పొందుతున్నారని వెల్లడైంది. ఇప్పుడు రైతులు దేశీయ కూరగాయలను పండించడమే కాకుండా విదేశీ రకాలను కూడా ప్రయత్నిస్తున్నారు. బ్రోకలీ ప్రస్తుతం భారతదేశంలో పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. పట్టణ మార్కెట్లలో బ్రోకలీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్రోకలీ క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. ఇది కాకుండా ఇది రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. మీరు కూడా బ్రోకలీని పండించాలని ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

బ్రోకలీ సాగు.. బ్రోకలీ సాగు18 నుంచి 23 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య పండుతుంది. పూసా బ్రోకలీ, KTS01, పాలమ్ సమృద్ధి, పాలెం కాంచన్, పాలమ్ విచిత్ర భారతదేశంలో పండించే బ్రోకలీ ప్రధాన రకాలు. మీకు కావాలంటే మీరు హైబ్రిడ్ రకాలను కూడా సాగు చేయవచ్చు.దీనిని వివిధ రకాల నేలల్లో పండించవచ్చు కానీ అధిక సేంద్రీయ కంటెంట్ కలిగిన ఇసుక నేలలు ఈ పంటకు ఉత్తమమైనవి. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం బ్రోకలీ సాగు కోసం మట్టి pH విలువ 6 నుంచి 6.5 మధ్య ఉండాలి. నాటడానికి ముందు పొలాన్ని బాగా సిద్ధం చేసుకోవడం ముఖ్యం. ఎక్కువ దిగుబడి సాధించాలంటే 25-30 రోజుల ముందుగానే ఆవు పేడను నేలలో కలపాలి. మట్టిని పరీక్షించడం మంచిది. పరీక్షలో ఏదైనా పోషక లోపం కనిపిస్తే వెంటనే సరిచేయాలి. ఒక హెక్టార్ పొలంలో బ్రోకలీని నాటాలనుకుంటే మీకు 400 నుంచి 500 గ్రాముల విత్తనాలు అవసరం. సాధారణ క్యాబేజీలాగే మొదట బ్రోకలీ నర్సరీని తయారు చేసి తర్వాత నాటాలి.

వరుసగా రెండు సంవత్సరాలు బ్రోకలీ సాగు చేయవద్దు మొలకలు సిద్ధమైన తర్వాత వాటిని పొలానికి తీసుకెళ్లి నాటండి. నాట్లు వేసే సమయంలో వరుస నుంచి వరుసకు 45 సెం.మీ దూరం మొక్క నుంచి మొక్కకు 30 సెం.మీ. దూరం ఉండాలి. ఒక హెక్టార్ భూమికి 100 కిలోల నత్రజని, 50 కిలోల పొటాషియం, 60 కిలోల భాస్వరం అవసరం. నీటిపారుదల గురించి మాట్లాడితే.. సాధారణంగా బ్రోకలీకి 10 నుంచి 12 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి. మొదటి రెండు నీటి తడుల తరువాత కలుపు తీయుట మంచిది. పొలాన్ని శుభ్రంగా ఉంచితే దిగుబడి ఎక్కువగా వస్తుంది. గత సంవత్సరం బ్రోకలీ వేసిన పొలంలో ఈ సంవత్సరం బ్రోకలీ నాటకూడదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. పాత పంట అవశేషాలు వివిధ రకాల తెగుళ్ళను కలిగి ఉంటాయి. అవి దిగుబడిని ప్రభావితం చేస్తాయని తెలిపారు.

Tirupati Kidnap: తిరుపతి కిడ్నాప్‌ కథ సుఖాంతం… తల్లి చెంతకు చేరిన 4 నెలల బాలుడు..

అతడు మిల్కాసింగ్ సోదరుడు.. కానీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు..

Corona on Children: తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లల్లో దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉండవు!