AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: స్మార్ట్‌కార్డులున్న ప్రయాణికులు బుకింగ్ కౌంటర్‌కు రాకుండానే రీచార్జ్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ

రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ శుభవార్త అందించింది. స్మార్ట్ కార్డులున్న ప్రయాణికులు బుకింగ్ కౌంటర్‌కు రాకుండానే రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

Good News: స్మార్ట్‌కార్డులున్న ప్రయాణికులు బుకింగ్ కౌంటర్‌కు రాకుండానే రీచార్జ్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ
Rail Passengers Smart Cards
Balaraju Goud
|

Updated on: Aug 07, 2021 | 6:56 AM

Share

Railway Smart Cards: రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే శాఖ శుభవార్త అందించింది. స్మార్ట్ కార్డులున్న ప్రయాణికులు బుకింగ్ కౌంటర్‌కు రాకుండానే రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అవకాశం కల్పిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ కార్డులు కలిగిన రైల్వే ప్రయాణికులు ‘UT Sonmobile’వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వారి కార్డులను ఆన్‌లైన్‌లో రీ-ఛార్జ్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. తద్వారా రిజర్వ్ చేయని టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల కొనుగోలు చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

గతంలో స్మార్ట్‌కార్డులో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు.. ప్రయాణికులు కార్డులను రీచార్జ్ చేసుకునేందుకు బుకింగ్ కౌంటర్స్ వద్దకు రావాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియను సులభతరం చేసేందుకు వారి స్మార్ట్ కార్డులను ఆన్‌లైన్‌లో రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో ఉన్నచోటే రీచార్జ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇక, రీచార్జ్ కోసం బుకింగ్ కౌంటర్ల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదని అధికారులు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్యూలైన్ వద్ద జనం బారులు తీరకుండా ఇది కొంత వరకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకుంటే.. వారికి విలువైన సమయం కూడా కలిసి వస్తుందంటున్నారు. కౌంటర్ల వద్ద రద్దీని నివారించడానికి ఆన్‌లైన్ పద్దతిని ఉపయోగించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

ఆన్‌లైన్‌ రీచార్జ్‌ సౌకర్యాన్ని ప్రయాణికుల నుంచి భారీగా స్పందన ఉంటుందని ఆశిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య పేర్కొన్నారు. ఇక, ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌కార్డు రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

రీచార్జ్ ఎలా చేసుకుకోవాలంటే.. ❁ తొలుత http://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ❁ అక్కడ స్మార్ట్ కార్డు రీచార్జ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్‌ ఎంతో ఎంటర్ చేయాలి. ❁ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాకింగ్.. ఇలా ఏదో ఒక రూపంలో రీచార్జ్ చేసుకోవాలి. ❁ పేమెంట్ ధ్రువీకరణ పొందిన తర్వాత.. వినియోగదారులు ATVM వద్దకు వెళ్లాలి. ATVM పైన స్మార్ట్ కార్డును ఉంచాలి. రీచార్జ్ స్మార్ట్ కార్డు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ATVM ఆటోమెటిక్‌గా వివరాలు క్రోడికరించి.. స్మార్ట్ కార్డులోకి డబ్బులు వచ్చేస్తాయి.

Read Also…  Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వచ్చిన పసిడి ధరలు.. ఎంత తగ్గిందంటే..!