Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. దిగి వచ్చిన పసిడి ధరలు.. ఎంత తగ్గిందంటే..!
Gold Price Today: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు ..
Gold Price Today: పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. భాతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి, మక్కువ. తాజాగా శనివారం బంగారం ధరలు దిగి వచ్చాయి. 10 గ్రాముల ధరపై స్వల్పంగా అంటే రూ.200 నుంచి 300 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవి మాత్రమే. బంగార కొనుగోలు చేసే వారు మీరు వెళ్లే సమయానికి ధర ఎంత ఉందో తెలుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
► దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.
అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.