AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Cards: అమెరికా ఆశావహులకు నిరాశే.. లక్ష గ్రీన్‌కార్డులు వృథా.. అసలు కారణం ఏంటంటే..!

Green Cards: అమెరికా ఆశావహులకు నిరాశే..! కోవిడ్‌ కారణంగా నత్తనడకన ఆమోదం పొందడంతో లక్ష మందికి గ్రీన్‌ కార్డు హోదా పొందే అవకాశం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. దీంతో..

Green Cards: అమెరికా ఆశావహులకు నిరాశే.. లక్ష గ్రీన్‌కార్డులు వృథా.. అసలు కారణం ఏంటంటే..!
Green Card
Subhash Goud
|

Updated on: Aug 06, 2021 | 12:03 PM

Share

Green Cards: అమెరికా ఆశావహులకు నిరాశే..! కోవిడ్‌ కారణంగా నత్తనడకన ఆమోదం పొందడంతో లక్ష మందికి గ్రీన్‌ కార్డు హోదా పొందే అవకాశం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. దీంతో చేసేదేమి లేక గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులంతా మేరీలాండ్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే అమెరికాలో వేలాది మంది భారతీయులు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా రంగంలో పని చేస్తున్న వారు గ్రీన్‌ కార్డుల కోసం ఎంతగానో వేచి చూస్తుంటారు. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశం కల్పించే గ్రీన్‌కార్డు చాలామందికి చిరకాల కోరిక. అయితే అత్యంత విలువైన ఆ కార్డులు.. ఈసారి లక్ష దాకా వృథా కాబోతున్నట్లు తెలుస్తోంది. అంటే లక్ష మందికి గ్రీన్‌కార్డు హోదా పొందే అవకాశం కోల్పోబోతున్నారు. కరోనా మహమ్మారి, అనంతరం అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో నత్తనడకన సాగుతున్న పనులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

సెప్టెంబర్‌ చివరి వరకే అవకాశం..

అయితే అమెరికాలో చట్టబద్దమైన ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాలు చూసే బాధ్యత సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ సంస్థ (యూఎస్‌సీఐఎస్‌)కు ఉంటుంది. 2020 అక్టోబరులో లక్షా 20వేల గ్రీన్‌కార్డుల జారీకి ఈ సంస్థ తన వార్షిక పని ప్రారంభించింది. ఈ సెప్టెంబరుతో ఈ ఏడాది పని పూర్తి కానుంది. అప్పటిదాకా ఎన్ని గ్రీన్‌కార్డులు జారీ చేస్తే అన్ని ఈ ఏడాది కోటాలో పూర్తయినట్లు లెక్క. మిగిలినవన్నీ వృథా అయినట్లే. ఇప్పటి వరకు ఎన్నింటిని పూర్తి చేశారనేదానిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేకపోయినా.. జూలైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. విదేశాంగ శాఖ అధికారి చార్లీ ఓపెన్‌హీమ్‌ చెప్పిన సంగతి చాలామంది అమెరికా ఆశావహులకు ఆశనిపాతంలా తాకింది. ఈ సెప్టెంబరు చివరి నాటికి సుమారు లక్ష గ్రీన్‌కార్డులు ఇంకా పెండింగ్‌లో ఉండిపోతాయని చార్లీ స్పష్టం చేశారు. అంటే సెప్టెంబరు చివరినాటికి వాటిని జారీ చేయకుంటే మురిగిపోయినట్లే. ఈసారి గ్రీన్‌కార్డు అవకాశం వచ్చీ చేజారిపోయిన వారు వచ్చే ఏడాది కోటాలో వరుసలో ముందర ఉండరు. మళ్ళీ వారికి అవకాశం రావటానికి కనీసం ఐదేళ్లయినా పట్టవచ్చని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

దెబ్బతీసిన కోవిడ్‌..

కాగా, నిధుల సమస్యను ఎదుర్కొంటున్న యూఎస్‌సీఐఎస్‌ను కరోనా మహమ్మారి కారణంగా మరింతగా దెబ్బతీసింది. కోవిడ్‌తో పనితీరు నెమ్మదించి, సిబ్బంది కొరత ఏర్పడింది. ఫలితంగా గ్రీన్‌కార్డుల జారీ మరింత ఆలస్యం అవుతోంది. సగటున ఓ గ్రీన్‌కార్డు దరఖాస్తుల పరిష్కారానికి పదిన్నర నెలల సమయం పట్టేది. ఇప్పుడు మరో రెండు నెలలు అదనంగా పడుతోందని చెబుతున్నారు. దేశాల ప్రాతిపదికన అమెరికాలో గ్రీన్‌కార్డుల జారీ చేస్తారు. భారతీయుల నుంచి ఎక్కువ దరఖాస్తులుండటంతో పోటీ మరింతగా ఎక్కువగా ఉంది. అవకాశం రావటానికి చాలా ఏళ్లు పడుతోంది. అదే తక్కువ మంది ఉండే దేశాల్లోని వారు వెనకాల వచ్చి దరఖాస్తు చేసినా గ్రీన్‌కార్డు వచ్చేస్తోంది.

మేరీలాండ్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల పిటిషన్‌

తాజా పరిస్థితి నేపథ్యంలో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులంతా సోమవారం మేరీలాండ్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ ఈ సెప్టెంబరులోగా తమ దరఖాస్తులు ఆమోదం పూర్తికాకుంటే వచ్చే ఏడాది కోటాలో వరుసలో తమను ముందే ఉంచేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ సెనెటర్లు కూడా ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి

RBI News: కీలక వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం.. రెపో, రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?

Health Insurance: మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారి కోసం రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. పూర్తి వివరాలు..