RBI News: కీలక వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం.. రెపో, రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?

Reserve Bank of India: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన..

RBI News: కీలక వడ్డీ రేట్లు యధాతథంగా కొనసాగిస్తూ ఆర్బీఐ నిర్ణయం.. రెపో, రివర్స్ రెపో రేటు అంటే ఏంటి?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 06, 2021 | 11:56 AM

Reserve Bank of India: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర్బీఐ. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు దవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. శుక్రవారం కమిటీ కీలక నిర్ణయాలు వెల్లడించింది. అయితే గత కొంత కాలంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత పారిశ్రామికోత్పత్తి భారీగా పెరుగుతుందని ఆశించినప్పటికీ వృద్ధి నెమ్మదిగానే ఉంది. అలాగే మే నెలలోకంటే జూన్‌లో జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. సేవల రంగంలోని ప్రయాణ, పర్యాటక, అతిథ్య రంగాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బ్యాంకు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను 4శాతం కమిటీ యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఇక రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే కోవిడ్‌ నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం ఉండడం, అలాగే ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి కారణం తెలుస్తోంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు ఎంపీసీ తక్కువ వడ్డీ రేట్లను నిర్వహిస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. కానీ దేశం చాలా మెరుగైన స్థితిలో ఉందని, అనేక ఆర్థిక సూచికలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. వర్షకాలం ఆర్థిక సూచికలను మెరుగుపర్చడం భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి తోడ్పే అవకాశం ఉందన్నారు. అయితే రెపో రేటు యథాతథంగా ఉంచడంతో గృహ రుణాలు, ఆటోమొబైల్స్‌ రుణాలు తీసుకునే వారికి నిరాశ ఎదురైంది.

రెపో రేటు అంటే ఏమిటీ?

ఆర్‌బీఐ వద్ద వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా వాణిజ్య బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకున్నపుడు వసూలు చేసే రేటును రెపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. స్వల్ప కాలికంగా దేశంలో ఆర్ధిక పరిస్ధితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటున‌ను తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులకు త‌క్కువ‌కే రుణాలు వ‌స్తాయి. ఈ ప్రభావంతో కంపెనీలకు, వ్యక్తులకు రుణాల వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రెపో రేటు తగ్గించినా దానిని సామాన్యుల‌కు బ‌ద‌లాయించేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవచ్చు.

రివర్స్ రెపో రేటు అంటే ఏమిటీ?

బ్యాంకులు తమ వద్ద డబ్బు ఎక్కువగా ఉంది అనుకుంటే దానిని రిజర్వ్ బ్యాంకుకు రుణాలుగా ఇవ్వొచ్చు.  ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది. మార్కెట్లో స్థిరత్వం లేన‌ప్పుడు బ్యాంకులు తమ అదనపు డబ్బును ఆర్‌బీఐ వ‌ద్ద ఉంచి త‌క్కువైనా స‌రే స్థిర‌ వడ్డీ ఆదాయాన్ని పొందేందుకు ఆస‌క్తి చూపిస్తాయి.

ఇవీ కూడా చదవండి

Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి..!

Gas Cylinder: పేటీఎం అదిరిపోయే ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌.. పూర్తి వివరాలు

RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి