RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!

RBI: ప్రస్తుతం బ్యాంకింగ్‌ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు మోసగాళ్ల అమాయకులను ఆసరా చేసుకుని మోసగిస్తున్నారు.

RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2021 | 1:05 PM

RBI: ప్రస్తుతం బ్యాంకింగ్‌ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు మోసగాళ్ల అమాయకులను ఆసరా చేసుకుని మోసగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకింగ్‌ మోసలు పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది. ఇటీవల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను భద్రపరచడానికి అనేక కొత్త చర్యలను ప్రవేశపెట్టింది. ఇకపై బ్యాంకులు జారీ చేసే అన్ని కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్‌) టెర్మినల్స్ వద్ద దేశీయ లావాదేవీలకు మాత్రమే అనుమ‌తి ఇస్తాయి. ఆన్‌లైన్ లావాదేవీల కోసం కార్డును ఉపయోగించాలనుకుంటే కార్డుదారుడు ముందుగా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. దుర్వినియోగాన్ని అరికట్టడానికి రెగ్యులేటర్ కొత్త నిబంధనలను కూడా విడుదల చేసింది ఆర్బీఐ.

ఆర్బీఐ కొత్త డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నిబంధనలు:

ఇష్యూ, రీ-ఇష్యూ సమయంలో, అన్ని కార్డులు భారతదేశంలోని సంప్రదింపు ఆధారిత వినియోగ పాయింట్ల వద్ద మాత్రమే ఉపయోగించే వీలుంద‌ని ఆర్‌బీఐ వెల్లడించింది. కార్డుదారులు తమ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులలో ఆన్‌లైన్‌ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలతో సహా ఇతర సౌకర్యాలను ప్రారంభించే వారు బ్యాంకును సంప్రదించాలి. ఈ సేవలు డీఫాల్ట్‌గా ఇకపై అందుబాటులో ఉండవు. భారత్‌లోనే కార్డును ఉపయోగించుకోవాలన్నా, అంతర్జాతీయ లావాదేవీలను ప్రారంభించాలన్నా ముందుగా బ్యాంకు అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్డు డీయాక్టివేట్‌ చేయడానికి, రీ-ఇష్యూ చేయడానికి బ్యాంకులకు హక్కు ఉంటుంది.

ఆన్‌లైన్‌ లావాదేవీలు, అంతర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం కార్డును ఉపయోగించకపోతే, వారి కార్డును నిలిపివేయడానికి బ్యాంకుకు అనుమతి ఉంటుంది. అలాగే ఏటీఎ ట్రాన్సాక్షన్స్‌, డేబిట్ లేదా, క్రెడిట్‌ కార్డులో లభించే ఆన్‌లైన్‌ లావాదేవీలను కార్డుదారులు తమ కార్డును ఆన్‌ చేసి స్విచ్‌ ఆఫ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారులు తమ లావాదేవీల పరిమితిని నిర్ణయించే సదుపాయాన్ని కూడా పొందవచ్చని ఆర్బీఐ వెల్లడించింది.

24 గంటలు పని చేసే మొబైల్‌ యాప్‌లు, పరిమితులను సవరించడానికి సేవలను ప్రారంభించడానికి, నిలిపివేయడానికి నెట్‌ బ్యాంకింగ్‌ ఎంపికలను అందించాలని ఆర్బీఐ బ్యాంకులను కోరింది. నియర్‌ బ్యాంకు కమ్యూకేషన్‌ టెక్నాలజీ ఆధారంగా చాలా బ్యాంకులు కార్డులు కూడా ఇస్తున్నాయి. ఒక వ్యాపారి అటువంటి కార్డులను స్వైప్ చేయవలసిన అవసరం లేదు లేదా వాటిని అమ్మకపు టెర్మినల్‌లో చేర్చాలి. వీటిని కాంటాక్ట్‌లెస్ కార్డులు అని కూడా అంటారు. కార్డుదారులు కూడా ఎన్ఎఫ్‌సీ ఫీచ‌ర్‌ను ప్రారంభించడానికి లేదా నిలిపివేయడానికి ఎంపికను పొందే అవకాశం ఉంది. అలాగే ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ కార్డులు, మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌లో ఉపయోగించే కార్డులకు ఈ కొత్త నిబంధనలు వర్తించవని ఆర్బీఐ తెలిపింది.

ఇవీ కూడా చదవండి

PAN Card: పాన్‌ కార్డు ఎందుకు..? ఏయే లావాదేవీలకు అవసరం అవుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

RBI Meeting: మూడు రోజుల పాటు ఆర్బీఐ కీలక సమావేశం.. వడ్డీ రేట్లపై నిర్ణయం..!

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి