RBI Meeting: మూడు రోజుల పాటు ఆర్బీఐ కీలక సమావేశం.. వడ్డీ రేట్లపై నిర్ణయం..!
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. గవర్నర్ శక్తికాంతదాస్..
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం ప్రారంభం కానుంది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు దవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. దీంతో శుక్రవారం కమిటీ కీలక నిర్ణయాలు వెల్లడించనుంది. అయితే గత కొంత కాలంగా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి ఉంది. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత పారిశ్రామికోత్పత్తి భారీగా పెరుగుతుందని ఆశించినప్పటికీ వృద్ధి నెమ్మదిగానే ఉంది. అలాగే మే నెలలోకంటే జూన్‌లో జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. సేవల రంగంలోని ప్రయాణ, పర్యాటక, అతిథ్య రంగాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. బ్యాంకు రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపోను (ప్రస్తుతం 4శాతం) కమిటీ యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే కోవిడ్ నేపథ్యంలో ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థల పురోగతికి సరళతర విధానాలే అవలంభించాల్సిన అవసరం ఉండడం, అలాగే ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తుందన్న అంచనాలు దీనికి కారణం తెలుస్తోంది. రెపోను వరుసగా 6 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్‌బీఐ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది.