Imran Khan: భారత్‌పై వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ నవ్వులపాలు.. విషయం తెలిస్తే మీరూ నవ్వుకుంటారు – Watch Video
Pakistan PM Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యాయి. ఈ సారి కూడా భారత్‌పై ఆయన తలతోక లేని వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారు.
Pakistan PM Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యాయి. ఈ సారి కూడా భారత్‌పై ఆయన తలతోక లేని వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారు. భారత్‌లో 1 బిల్లియన్ (100 కోట్లు) అండ్ 300 కోట్ల జనాభా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. భారత్‌లో 1.3 బిల్లియన్ లేదా 130 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పబోయి..ఇలా 1 బిల్లియన్ అండ్ 300 కోట్లు అంటూ ఇమ్రాన్ ఖాన్ తప్పులో కాలేశారు. పాకిస్థాన్‌లో క్రీడల దుస్థితిపై మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ఇలా అసందర్భంగా భారత ప్రస్తావన తీసుకొచ్చారు. అతి తక్కువ జనాభా కలిగిన న్యూజిలాండ్..అత్యధిక జనాభా కలిగిన భారత్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడించిందని గుర్తుచేశారు.
ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. ఆయన కామెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
India’s population is one billion and 300 crore- Pakistani Prime Minister Imran Khan
— Shama Junejo (@ShamaJunejo) August 1, 2021
గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి అనాలోచిత వ్యాఖ్యలతో నవ్వులపాలయ్యాయి. 2019లో ఇమ్రాన్ ఖాన్ ఓ కార్యక్రమంలో జర్మనీ- జపాన్ మధ్య సంబంధాలు, ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు అంటూ లెక్చర్ దంచారు. వాస్తవానికి ఆయన చెప్పాలనుకున్నది జర్మనీ – ఫ్రాన్స్ సంబంధాల గురించి.. జర్మనీ-జపాన్ దేశాలు సరిహద్దులు పంచుకోవాలన్న కనీస జ్ఞానం లేకపోతే ఎలా అంటూ అప్పట్లో ఇమ్రాన్ ఖాన్‌ను సొంత దేశానికి చెందిన నెటిజన్సే ప్రశ్నించారు.
పాకిస్థాన్‌లో మహిళలపై అత్యాచార ఘటనలకు వారి వస్త్రధారణే కారణమంటూ గతంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ట్రోల్స్ చేశారు.
Also Read..
వ్యాక్సిన్ల తయారీలో ఇండియాకు మాదే ఆపన్న హస్తం..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న యువతి..