India Corona Cases: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే!
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి...
దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 42,625 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ఇందులో 4,10,353 యాక్టివ్ కేసులు ఉండగా, 3,09,33,022 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 562 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,25,757కి చేరుకుంది. నిన్న కొత్తగా 36,668 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజులో 18,47,518 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు మొత్తంగా 47,31,42,307 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. అటు ఇప్పటిదాకా 48,52,86,570 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Also Read:
భర్త వింత అలవాటు.. రోజుకు 4 గంటలు టాయిలెట్‌లోనే.. కారణం తెలిసి భార్య షాక్.!
కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఈ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. అబ్బాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్.. గుర్తుపట్టారా!
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona #StaySafe pic.twitter.com/fLEDoteKuz
— ICMR (@ICMRDELHI) August 4, 2021