అయ్యో పాపం.. చిన్నారి వయసు రెండేళ్లు.. బరువు మాత్రం 45 కిలోలు.. అరుదైన సర్జరీ చేసిన వైద్యులు..!

Subhash Goud

Subhash Goud |

Updated on: Aug 04, 2021 | 10:02 AM

Bariatric Surgery ఎంతో మంది పిల్లలు లేక ఎంతో బాధపడుతుంటారు. కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటారు. పుట్టిన తర్వాత ఎంతో..

అయ్యో పాపం.. చిన్నారి వయసు రెండేళ్లు.. బరువు మాత్రం 45 కిలోలు.. అరుదైన సర్జరీ చేసిన వైద్యులు..!

Follow us on

Bariatric Surgery ఎంతో మంది పిల్లలు లేక ఎంతో బాధపడుతుంటారు. కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటారు. పుట్టిన తర్వాత ఎంతో మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఇక్కడ మాత్రం ఓ చిన్నారికి పెద్ద సమస్యతో అరుదైన సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పాప వయసు కేవలం రెండు సంవత్సరాలు. కానీ బరువు మాత్రం ఏకంగా 45 కేజీలు. సాధారణంగా, ఆ వయస్సు పిల్లల బరువు 12-15 కిలోలు ఉంటుంది. కానీ ఖ్యాతి వర్షిణి అనే రెండేళ్ల చిన్నారి ఊబకాయంతో ఇబ్బందులు పడుతూ అడుగులు వేయలేకపోయేది. పడుకోవడం కూడా కష్టతరంగా మారింది. దీంతో ఆ పాపకి ఒంట్లోంచి కొవ్వుని బయటకు తీసే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని పత్‌పర్‌గంజ్‌లోని మాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్‌ సర్జరీతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.

ఖ్యాతి వర్షిణి పుట్టినప్పుడు మామూలుగా రెండు కిలోలు బరువుంది. కానీ ఆరు నెలలు వచ్చే సరికి 14 కిలోల బరువు పెరిగిపోయింది. ఆ తర్వాత ఆ పాప రెండేళ్లు వచ్చే సరికి ఏకంగా 45 కిలోల బరువు పెరిగిపోయింది. ఈ అధిక బరువు కారణంగా ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుండటంతో వైద్యులు అధికంగా శ్రమిచి సర్జరీ చేయాల్సి వచ్చిందని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ మన్ ప్రీత్ సేథి వెల్లడించారు.

దేశంలో శాస్త్ర చికిత్స చేయించుకున్న అతి పిన్న వయస్కురాలు:

కాగా, దేశంలో అత్యధికంగా బరువు పెరిగి, బరువును తగ్గేందుకు శాస్త్ర చికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలు ఈ చిన్నారేనని వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్స జరిగిన ఐదు రోజుల తర్వాత, చిన్నారి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన గురక పూర్తిగా ఆగిపోయిందని అనిష్టీషియా వైద్యుడు అరుణ్ పురి చెప్పారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న ఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి మార్గం మరింత సుగమమైందని ఆయన తెలిపారు.

ఇవీ కూడా చదవండి

దురద, దద్దుర్లు వంటి చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే

Health Tips: బరువు తగ్గడానికి ఈ 5 ఆహారాలు బెస్ట్..! వ్యాధులు కూడా దూరం.. తెలుసుకోండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu