AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: పాన్‌ కార్డు ఎందుకు..? ఏయే లావాదేవీలకు అవసరం అవుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

PAN Card: పాన్‌ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌కార్డు బ్యాంకు లావాదేవీల విషయాలలో తప్పకుండా అవసరం. లేకపోతే పనులు జరగవు. ఆదాయపు పన్ను

PAN Card: పాన్‌ కార్డు ఎందుకు..? ఏయే లావాదేవీలకు అవసరం అవుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!
Pan Card
Subhash Goud
|

Updated on: Aug 04, 2021 | 11:17 AM

Share

PAN Card: పాన్‌ కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్‌కార్డు బ్యాంకు లావాదేవీల విషయాలలో తప్పకుండా అవసరం. లేకపోతే పనులు జరగవు. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పువచ్చు. పలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పకుండా కావాలి. అయితే పాన్‌కార్డు ఏయే లావాదేవీల్లో అవసరం ఉంటుందో ఓ సారి చూద్దాం.

* టూవీలర్ మినహా ఇతర వాహన కొనుగోలు లేదా అమ్మకానికి పాన్ కార్డు ఇవ్వాలి. * బ్యాంకుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటే పాన్‌ కార్డు తప్పనిసరి కావాల్సిందే. * క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఇది ఉండాల్సిందే. * డీమ్యాట్ అకౌంట్ తెరవాలన్నా పాన్ తప్పనిసరి. * హోటల్ లేదా రెస్టారెంట్‌లో బిల్లు పేమెంట్ రూ.50 వేలకుపైగా దాటి నగదు చెల్లింపులు నిర్వహిస్తే.. పాన్ కార్డు నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. * ఫారిన్ కరెన్సీ కొనుగోలు సమయంలో రూ.50 వేలకు పైన నగదు ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే పాన్ నెంబర్‌ ఉండాల్సిందే. * మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 వేలకు పైన డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం అవుతుంది. * కంపెనీ డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి. *ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు పైన లావాదేవీలు జరిపితే పాన్‌ నెంబర్‌ తప్పకుండా అవసరం. * ఒక రోజులో బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. * బ్యాంక్‌లో చెక్ ద్వారా లేదా నగదు రూపంలో ఒక రోజులో రూ.50 వేలకు పైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి. * ఒక ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు రూ.50 వేలు దాటితే పాన్ నెంబర్ ఇవ్వాలి. * షేర్లు కాకుండా ఇతర సెక్యూరిటీస్ కొనుగోలు సమయంలో లావాదేవీ విలువ రూ.లక్ష దాటితే పాన్ కార్డు అవసరం అవుతుంది. * రూ.10 లక్షలకు పైన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సి వస్తే పాన్‌ తప్పకుండా అవసరమే. * వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.

అలా ఇన్ని అవసరాలకు పాన్‌ కార్డు తప్పకుండా అవసరం ఉంటుంది. అందుకే అధికారులు పాన్‌ కార్డు తీసుకోవాలని పదేపదే చెబుతుంటారు. ఒకప్పుడు పాన్‌ కార్డు కావాలంటే దాదాపు 45 రోజుల సమయం పట్టేది. కానీ ఇప్పుడు పది నిమిషాల్లోనే కార్డు ప్రింట్‌ తీసుకుని అప్పటి అవరానికి వాడుకోవచ్చు. కానీ ఒరిజినల్‌ కార్డు కావాలంటే వారం రోజుల్లో వస్తుంది.వచ్చు. ఆ తర్వాత ఒరిజినల్‌ కార్డును వారం రోజుల్లో తెప్పించుకోవచ్చు. ఒకప్పుడు ఉండే రూల్స్‌ ఇప్పుడు లేవు. త్వరగా కార్డు పొందవచ్చు. ఆధార్‌ కార్డు మాదిరిగానే చాలా మందికి పాన్‌ కార్డు కూడా అవసరం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం పాన్‌ కార్డు జారీలో మరింత సులభతరం చేసింది.

ఇవీ కూడా చదవండి

RBI Meeting: మూడు రోజుల పాటు ఆర్బీఐ కీలక సమావేశం.. వడ్డీ రేట్లపై నిర్ణయం..!

Flipkart Big Saving Days Sale: మీకు ఫ్లిప్‌కార్ట్‌లో మెంబర్‌షిప్‌ ఉందా..? అయితే బంబర్‌ ఆఫర్‌..!