Gas Cylinder: పేటీఎం అదిరిపోయే ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌.. పూర్తి వివరాలు

Gas Cylinder: భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం పేటీఎం (Paytm) LPG సిలిండర్ బుకింగ్ కోసం అద్భుతమైన క్యాష్‌బ్యాక్..

Gas Cylinder: పేటీఎం అదిరిపోయే ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Aug 04, 2021 | 1:45 PM

Gas Cylinder: భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం పేటీఎం (Paytm) LPG సిలిండర్ బుకింగ్ కోసం అద్భుతమైన క్యాష్‌బ్యాక్, ఇతర రివార్డ్‌లను ప్రకటించింది. కొత్త వినియోగదారులు మూడు సార్లు గ్యాస్‌ బుకింగ్‌ చేసినట్లయితే రూ. 2700 క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందగలరు. అయితే ఒకేసారి అనుకుంటూ పొరపాటే మూడు సార్లు బుక్ చేస్తే వారు వరుసగా మూడు నెలలపాటు రూ.900 చొప్పున క్యాష్‌ బ్యాక్‌ అందుకోవచ్చు. అలాగే వివిధ బ్రాండ్‌ల నుండి రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు పొందే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎల్‌పీజీ ఇండెన్‌, హెచ్‌పీ, భారత్‌ గ్యాస్‌ బుకింగ్‌లపై ఈ క్యాష్‌బ్యాక్‌ వర్తించనున్నట్లు పేటీఎం తెలిపింది. పేటిఎమ్ పోస్ట్‌పెయిడ్ అని పిలువబడే పేటిఎమ్ నౌ పే లేటర్ ప్రోగ్రామ్‌లో నమోదు చేయడం ద్వారా కస్టమర్‌లు సిలిండర్ బుకింగ్‌లో క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

ఇటీవల, కంపెనీ వారి గ్యాస్ సిలిండర్ల డెలివరీని ట్రాక్ చేయడానికి, రీఫిల్స్ కోసం ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్‌లను స్వీకరించడానికి వినియోగదారులను అనుమతించే వినూత్న ఫీచర్లను జోడించడం ద్వారా సిలిండర్ బుకింగ్‌ను మరింతగా మెరుగుపరిచింది. సిలిండర్‌ బుకింగ్‌ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలేత్తకుండా చర్యలు చేపట్టింది. అయితే గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ చేసేవారు పేటీఎం యాప్‌లోని బుక్ గ్యాస్ సిలిండర్ ఆప్షన్‌లోకి వెళ్లి గ్యాస్ ప్రొవైడర్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌, ఎల్‌పిజి ఐడి, వినియోగదారు నెంబరు ఎంటర్ చేసి, ఆపై పేటీఎం వాలెట్, ఇతర మోడ్‌లను ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అయితే పేటీఎం హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీతో ఈ సిలిండర్ బుకింగ్‌ సదుపాయాన్ని గత ఏడాది ప్రారంభించింది. ఆ తర్వాత ఇండేన్, భారత్ గ్యాస్‌ భాగస్వామ్యంతో ఈ సిలిండర్‌ బుకింగ్‌ ప్రారంభించింది.

Paytm

ఇవీ కూడా చదవండి

RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!

Twitter: ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌.. బగ్‌ను గుర్తిస్తే భారీ బహుమతి.. హ్యాకర్లకు సవాల్‌ విసరుతున్న ట్విటర్‌..!

PAN Card: పాన్‌ కార్డు ఎందుకు..? ఏయే లావాదేవీలకు అవసరం అవుతుంది..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి