Floatplane Crash: అమెరికాలో కుప్పకూలిన చిన్న విమానం.. ఆగ్నేయ అలస్కాలో ఘటన.. ఫైలట్‌తో సహా ఆరుగురు మృతి
అమెరికాలో మరో చిన్న విమానం కుప్పకూలిన ఘనటలో ఆరుగురు వ్యక్తుులు దుర్మరణం పాలయ్యారు. ఆగ్నేయ అలస్కాలో గురువారం కెట్ చికాన్ పట్టణ సమీపంలోని నీటిలో సందర్శకుల విమానం కుప్పకూలింది.
Alaska Floatplane Crash: అమెరికాలో మరో చిన్న విమానం కుప్పకూలిన ఘనటలో ఆరుగురు వ్యక్తుులు దుర్మరణం పాలయ్యారు. ఆగ్నేయ అలస్కాలో గురువారం కెట్ చికాన్ పట్టణ సమీపంలోని నీటిలో సందర్శకుల విమానం కుప్పకూలింది. విమానంలోని పైలట్‌తో సహా ఆరుగురు మరణించారని యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, ఒక పైలెట్ ఉన్నారని సౌత్ ఈస్ట్ ఏవియేషన్ సంస్థ తెలిపింది. విమానం కూలిన సమయంలో ఆ ప్రాంతంలో పొగమంచుతోపాటు తేలికపాటివర్షం కురుస్తోందని కోస్ట్ గార్డు అధికారులు చెప్పారు. అలాగే, పర్వత ప్రాంతం కావడంతో దుర్ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కెట్ చికాన్ పట్టణ సమీపంలో సందర్శనా విమానం కూలిపోయింది. వఐదుగురు ప్రయాణీకులు హాలండ్ అమెరికా లైన్ క్రూయిజ్ ప్రయాణీకులు అని క్రూయిజ్ లైన్ ట్విట్టర్‌లో తెలిపింది. విమానం నీళ్లలో కూలిపోవడంతో సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను గుర్తించేందుకు గజఈతగాళ్ల సాయంతో గాలించినా ప్రయోజనం లేకపోయిందని తెలిపారు. ఆగ్నేయ అలస్కాలో సందర్శనా విమానం సిట్కా కోస్ట్ గార్డ్ ఎయిర్ స్టేషన్ నుంచి వెళ్లిన జేహాక్ హెలికాప్టర్ సిబ్బంది విమానం కూలిన ప్రాంతంలో శిథిలాలను కనుగొంది. “కోస్ట్ గార్డ్ ఎయిర్ స్టేషన్ సిట్కా నుండి ఒక MH-60 జేహాక్ హెలికాప్టర్ సిబ్బంది మధ్యాహ్నం 2:37 గంటలకు శిథిలాలను గుర్తించామని తెలిపారు.
విమానంలో ఉన్న ఐదుగురు ప్రయాణీకులు హాలండ్ అమెరికా లైన్ క్రూయిజ్ షిప్ న్యూయు ఆమ్ స్టర్ డామ్ నుండి వచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హాలండ్ అమెరికా గురువారం సాయంత్రం ట్విట్టర్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. 2019 లో రెండు విమానాలు రెండు ఫ్లోట్ ప్లేన్స్ విమానాలు మధ్యలోనే ఢీకొన్నాయి. రెండు విమానాలలో ఉన్న 16 మందిలో ఆరుగురు మరణించారు. ఆ విమానాలు క్రూయిజ్ షిప్ ప్రయాణీకులను తీసుకువెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఆగ్నేయ అలస్కాలోని ఇతర కమ్యూనిటీలకు ఎయిర్ చార్టర్‌లతో పాటు మిస్టీ ఫ్జార్డ్స్ నేషనల్ మాన్యుమెంట్, బేర్-వ్యూయింగ్ సైట్‌లకు సందర్శనా పర్యటనలకు చిన్నా విమానాలను నడుపుతోందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. కాగా, ఘటనకు సంబంధించి FAA, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తోంది.