AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC Fire: లక్సెట్టిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. మంటల్లో పూర్తిగా తగలబడిన బ్యాంకు, భారీగా ఆస్తినష్టం

మంచిర్యాల జిల్లాలో రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్సెట్టిపేటలోని HDFC బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. బ్యాంక్ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి

HDFC Fire: లక్సెట్టిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం..  మంటల్లో పూర్తిగా తగలబడిన బ్యాంకు, భారీగా ఆస్తినష్టం
Fire Accident
Venkata Narayana
|

Updated on: Aug 07, 2021 | 8:24 AM

Share

Fire breaks out: మంచిర్యాల జిల్లాలో రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. లక్సెట్టిపేటలోని HDFC బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. స్థానిక బీటు బజారులో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ శబ్దాలతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బ్యాంక్ అంతా మంటలు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. స్థానికుల సాయంతో అగ్నిమాపకదళ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. షార్ట్‌ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది తెలిపారు. మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

అయితే, ఈ అగ్ని ప్రమాదం ఎవరైనా చేసిన పనా లేక ఇతర కారణాలతో జరిగిందా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బ్యాంకులో ప్రమాదం కావడంతో విలువైన పత్రాలతోపాటు, భారీగా నష్టం వాటిల్లి ఉండవచ్చని భావిస్తున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు  కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రతకు బ్యాంకు లాకర్‌లో ఉన్న రూ. కోటి , ఏటీఎంలో సుమారు రూ. 15 లక్షల వరకు ఉన్న నగదు అగ్నికి ఆహుతి అయినట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘోర సంఘటన జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలోని అగ్రహారం వద్ద చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఇన్నోవా కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.

దీంతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read also:  Bears Hulchul: ఏ చెట్టు పైన ఎలాంటి ఎలుగుబంటి ఉందో…!!! హడలెత్తిపోతోన్న జనాలు