Bears Hulchul: ఏ చెట్టు పైన ఎలాంటి ఎలుగుబంటి ఉందో…!!! హడలెత్తిపోతోన్న జనాలు
ఆ గ్రామంలో ఏ చుట్టూ చూసినా.. గ్రామస్థులు హడలెత్తిపోతున్నారు. చెట్టును చూసి భయమెందుకంటే.. చెట్టుపై ఎలుగుబంటి ఉంటుందోమోనని. అదేంటి..! చెట్టుపై ఎలుగుబంటి
Bears panic – Anantapuram: ఆ గ్రామంలో ఏ చుట్టూ చూసినా.. గ్రామస్థులు హడలెత్తిపోతున్నారు. చెట్టును చూసి భయమెందుకంటే.. చెట్టుపై ఎలుగుబంటి ఉంటుందోమోనని. అదేంటి..! చెట్టుపై ఎలుగుబంటి ఎందుకు ఉంటుందంటే.. ఆ గ్రామంలో తరచూ ఎలుగుబంట్ల సంచారం గ్రామస్థుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామ సమీపంలో ఒక చెట్టు వద్దకు రైతు వచ్చాడు. అయితే ఏదో అలికిడి అయితే పైకి చూశాడు.. అంతే గుండె ఆగినంత పనైంది.
ఎందుకంటే.. చెట్టు పై ఎలుగుబంటి కూర్చుంది. వెంటనే గ్రామస్థులంతా అక్కడికి వచ్చి చూసినా ఎలుగుబంటి ఏమాత్రం లెక్క చేయకుండా చెట్టు నుంచి కిందికి దిగలేదు. కాసేపటి గ్రామస్థులు చూస్తుండగానే అది తీరిగ్గా దిగి వెళ్లిపోయింది. అంత మంది గ్రామస్థులను చూసినా అది చెట్టు చీటారు కొమ్మల్లో సేద తీరుతోంది కాని భయపడలేదు.
మరోవైపు మూడు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్రిడ్జిపై ఎలుగుబంటి కనిపించింది. బ్రడ్జి దాటుతుండగా కారులో ప్రయాణిస్తున్న వాహనదారుడు సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించారు. అయితే ఎలుగుబంటి చెట్లు ఎక్కడం దిగడం సరదా ఏమో కానీ.. గ్రామస్థులు మాత్రం వాటిని వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి వాటిని బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
లక్ష్మీకాంత్, టీవీ9 తెలుగు, అనంతపురం జిల్లా
Read also: Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్ నర్సుపై పేషెంట్ బంధువు లైంగిక దాడి