Nellore District: పుష్పరాజ్‌ను మించిపోయిన ఎర్రచందనం స్మగ్లర్స్‌.. కానీ పోలీసులకు చిక్కారు..

నెల్లూరు జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 45 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Nellore District: పుష్పరాజ్‌ను మించిపోయిన ఎర్రచందనం స్మగ్లర్స్‌.. కానీ పోలీసులకు చిక్కారు..
Red Sanders Arrested
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 24, 2022 | 3:09 PM

Smugglers:  నెల్లూరు జిల్లా(Nellore District) రాపూరు అటవీప్రాంతంలో భారీగా ఎర్రచందనం(Red Sandal) స్మగ్లర్లను పట్టుకున్నారు పోలీసులు. రాపూరు ఫారెస్టులో భారీగా తమిళనాడు కూలీలు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్‌ చేశారు. 55 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో రవాణాకు సిద్ధంగా ఉన్నభారీగా ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులను చూసి వాహనాలను ఆపకుండా.. గొడ్డళ్లను సైతం విసిరినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి వీరి వెనకున్న ప్రధాన నిందితులను అరెస్టు చేస్తామన్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రాపూరు అటవీ ప్రాంతంలో తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన 55 మంది కూలీలతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని నరికిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ ప్రాంతానికి బయల్దేరారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్లు అడవిలో నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు.

పక్కా సమాచారంతో రైడ్‌ చేసిన పోలీసులు.. మొత్తం 55 మంది ఎర్రచందనం నరికే కూలీలు, ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన దాము, పాండిచ్చేరికి చెందిన పళని, వేలూరుకు చెందిన సుబ్రమణ్యంలు పైలెట్లుగా వ్యవహరిస్తూ, 55 మంది తమిళనాడు కూలీలను తీసుకువచ్చి రాపూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికినట్లు పోలీసులు చెప్పారు.   సుమారు 40 లక్షల వరకు విలువ చేసే 45 ఎర్రచందనం దుంగలు, రెండు వాహనాలు, 31 సెల్ ఫోన్లు, 75 వేల రూపాయల నగదు, గొడ్డళ్లు, బరికెలు స్వాధీనం చేసుకున్నారు. కూలీలంతా పాండిచేరి, చెన్నైకి చెందిన వారిగా పోలీసులు తెలిపారు.

Also Read: Telangana: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆదివారం వ‌చ్చిందంటే అక్క‌డ వ‌ణుకు

 ఇంటి ముందు గేట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. కానీ ఊహించని విధంగా

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే