AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: ఇంటి ముందు గేట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. కానీ ఊహించని విధంగా

బుద్ది.. అదే గుణం మంచిదైతే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గౌరవం పొందవచ్చు అంటారు పెద్దలు. బద్ది మంచిది కాకపోతే ఎవరూ దగ్గరకు రానివ్వరు. గుండు సూది దొంగతనం చేసినా.. కోటి రూపాయలు దొంగతనం చేసినా.. దొంగోడు అనే అంటారు.

Krishna District: ఇంటి ముందు గేట్లు ఎత్తుకెళ్లిన దొంగలు.. కానీ ఊహించని విధంగా
Representative image
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2022 | 2:10 PM

Share

Variety Theft అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అలాగే దొంగతనానికి కూడా కాదేది అనర్హం అంటున్నారు కొందరు విచిత్ర దొంగలు. వింత దొంగతనాలు ఒక్కొక్కసారి పోలీసులను కూడా కంగుతినేలా చేస్తున్నారు. ఇదేం దొంగతనం రా బాబు అని ముక్కున వేలేసుకునేలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం థర్డ్ ఐ( CCTV Cameras ) వచ్చాక దొంగలందరూ మాగ్జిమమ్ దొరికిపోతున్నారు. సాంకేతికత.. చిన్న తప్పులు చేసినవారిని కూడా పట్టించివేస్తోంది. పోలీసులకు దొంగల్ని పట్టుకోవడంలో టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. తాజాగా ఏపీలో ఓ వింత దొంగతనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాములుగా  దొంగతనం జరిగింది.. అనగానే అందరూ డబ్బు, నగలు, విలువైన వస్తువులు పోయుంటాయని అంతా అనుకుంటారు..కానీ, కృష్ణాజిల్లాలో మాత్రం వింత దొంగలు వెరైటీ చోరీకి విఫలయత్నం చేశారు. జగ్గయ్యపేట(Jaggayyapeta) మండలం అన్నవరంలో ఓ ఇంటి ముందు ఉంచిన ఐరన్‌గేట్లను ఎత్తుకెల్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. దాంతో స్థానికులు ఆ దొంగలకు తగిన గుణపాఠం చెప్పారు.

ఇంటి ముందున్న ఇనుప గేట్లను ఆటోలో ఎత్తుకెళ్తుండగా స్థానికులు దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు దొంగలను ఓ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకొని.. రిమాండ్‌కి తరలించారు.

Also Read: అపరకాళిగా మారిన ఆళి.. భర్తను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదింది.. ఎందుకంటే..?

హెల్మెట్‌ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్‌.. అతగాడి ఓవరాక్షన్ చూడండి