Karimnagar: హెల్మెట్‌ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్‌.. అతగాడి ఓవరాక్షన్ చూడండి

హెల్మెట్ పెట్టుకోమని చెప్పినందుకు ఓ యువకుడు ఓవరాక్షన్ చేశాడు. కానిస్టేబుల్‌పైకి వెళ్లి దాడి చేసేందుకు యత్నించాడు. చుట్టూ ఉన్న వారు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయాడు.

Karimnagar: హెల్మెట్‌ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్‌.. అతగాడి ఓవరాక్షన్ చూడండి
Ci Son
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 23, 2022 | 3:51 PM

కరీంనగర్‌ పట్టణంలో వీరంగం సృష్టించారు కొందరు యువకులు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ బండిపై వెళ్తున్న యువకులకు హెల్మెట్‌ పెట్టుకోవాలని సూచించిన కానిస్టేబుల్‌పైనే దాడి చేశారు. సీఐ కొడుకునే ఆపుతావా అంటూ నడిరోడ్డుపై కాస్త అతిగానే ప్రవర్తించాడు వారిలోని ఓ యువకుడు. నాకే రూల్స్ చెబుతావా అంటూ ఓ రేంజ్‌లో హల్‌చల్ చేశాడు. స్థానికులు వారిస్తున్నా కానిస్టేబుల్ ను అసభ్యంగా తిడుతూ దాడి చేశాడు. నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా బైక్‌ వెళ్తున్న యువకుడిని పోలీస్ కానిస్టేబుల్‌ అడ్డుకున్నాడు..హెల్మెట్‌ ఎందుకు పెట్టుకోలేదని అతడిని ప్రశ్నించాడు. అందుకు చిర్రెత్తిపోయిన యువకుడు హంగామా సృష్టించాడు. నా ఇష్టం నీవెవరు చెప్పడానికంటూ సదరు యువకుడు పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. చుట్టుపక్కల వాళ్లంతా యువకుడిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా కానిస్టేబుల్ ను ఇష్టం వచ్చినట్లు తిడుతూ బెదిరింపులకు దిగాడు. చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరికి సర్ధిచెప్పారు. యువకుడిని స్టేషన్‌కి తీసుకెళ్తే కానీ అసలు సంగతి తెలియలేదు. దాడి చేసిన యువకుడు ఓ మహిళా సీఐ పుత్రరత్నం అని తెలిసింది. ఈ వ్యవహారం కరీంనగర్‌లో చర్చనీయాంశంగా మారింది. హెల్మెట్ పెట్టుకుంటే ఎవర్నో ఉద్దరించినట్టు కాదు.. నీకు నువ్వు రక్షణ కల్పించుకున్నట్లు. చదవుకున్న యువత కూడా ఈ అంశాన్ని అర్థచేసుకోకపోగా.. మంచి చెప్పినవారిపై దాడులకు దిగడం విడ్డూరంగా ఉంది.

Also Read: Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు ఇప్పడు తెలుగునాట స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..