Viral Photo: ఈ ఫోటోలోని చిన్నోడు ఇప్పడు తెలుగునాట స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
పైన ఫోటోలో ఎంతో అమాయకుడిగా ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా ? అతడు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో. విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టారా..?
పైన ఫోటోలో ఎంతో అమాయకుడిగా ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా ? అతను ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరేట్. ఈ కుర్రాడికి యూత్‌లో క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ముందు చిన్న, చిన్న పాత్రలు వేస్తూ ప్రేక్షకులకు పరిచయమైన ఈ కుర్రాడు.. క్రమక్రమంగా తన కెరీర్ ను మలుచుకున్నాడు. ఒక్కో సినిమాతోనే ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రేజీ స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలలో ఒకరిగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. సినిమాకు వెళ్తే అస్సలు నిరాశపరచడు అన్న పేరు సంపాదించుకున్న ఈ కుర్రహీరో ఎవరో గుర్తుపట్టరా ?.. లేదా అయితే ఇక లేటెందుకు ఇక మేమే చెప్పేస్తాం.
పైన ఫోటోలలో ఉన్న కుర్రాడు మరెవరో కాదు..శర్వానంద్. సినిమా సినిమాకు తన నటనలో పరిణితి పెంచుకుంటూ వస్తున్నాడు శర్వ. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేస్తూ ..ఆతర్వాత సెకండ్ హీరోగా నటిస్తూ మెల్లగా హీరోగా ఎదిగాడు శర్వానంద్. యువసేన’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నడు ఈ యంగ్ హీరో. అయితే శర్వా.. చేసే ప్రతి సినిమాలోనే విభిన్నత ఉంటుంది. క్రిష్ తెరకెక్కించిన ‘గమ్యం’ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. గమ్యం సినిమా తర్వాత వచ్చిన ప్రస్థానం సినిమాతో మరో మెట్టు ఎక్కాడు ఈ కుర్ర హీరో. ఆ తర్వాత శర్వా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్ తొలి నాళ్లలో ఆర్ట్ మూవీస్ మాత్రమే చేసినా.. ఆ తర్వాత కమర్షియల్ హీరోగా కూడా నిలదొక్కుకున్నాడు. ఇక ‘రన్ రాజా రన్’, ఎక్స్ ప్రెస్ రాజా, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు వంటి సినిమాలతో మంచి మార్కులను కొట్టేసాడు. శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరై సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆతర్వాత రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు శర్వానంద్. ఈ హీరో చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Also Read: Vizianagaram District: మైనర్లు, మహా ముదుర్లు.. మహిళలు పూలకు వెళ్లటం చూసి..