Samantha: ఆ స్టార్ హీరో కోసం స‌మంత మ‌రోసారి ‘ఊ’ అనేసిందా.? క్రేజీ ప్రాజెక్టులో సామ్‌..

Samantha: వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ బిజీగా మారిపోయింది స‌మంత‌. మ‌రీ ముఖ్యంగా విడాకుల త‌ర్వాత కెరీర్‌పై దృష్టి సారించిన సామ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే కెరీర్‌లో తొలిసారి స్పెస‌ల్ సాంగ్‌లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది...

Samantha: ఆ స్టార్ హీరో కోసం స‌మంత మ‌రోసారి ‘ఊ’ అనేసిందా.? క్రేజీ ప్రాజెక్టులో సామ్‌..
సమయం దొరికినప్పుల్లా సామ్ విహార యాత్రలకు వెళ్తుంటుంది. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఆమె తన స్నేహితురాలితో కలిసి బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2022 | 3:09 PM

Samantha: వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతూ బిజీగా మారిపోయింది స‌మంత‌. మ‌రీ ముఖ్యంగా విడాకుల త‌ర్వాత కెరీర్‌పై దృష్టి సారించిన సామ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే కెరీర్‌లో తొలిసారి స్పెస‌ల్ సాంగ్‌లో న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రంలో స‌మంత ‘ఊ అంటావా మావ’ అనే పాట‌లో త‌ళుక్కుమ‌న్న విష‌యం తెలిసిందే. పుష్ప విజ‌యంలో ఈ పాట కూడా కీలక పాత్ర పోషించ‌ద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రినీ ఊపేసిందీ పాట‌.

ఇక ఇప్ప‌టికే హీరోయిన్‌గా ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్న సామ్ మ‌రోసారి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుందా.. అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కుతోన్న లైగ‌ర్ సినిమాలో స‌మంత స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌నుంద‌నేది స‌ద‌రు వార్త సారాంశం.  బాక్సింగ్ నేప‌థ్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలోని స్ప‌ష‌ల్ సాంగ్‌లో స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాల‌ని భావిస్తోన్న పూరీ.. స‌మంత అయితే బెస్ట్ ఛాయిస్ అనే అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు, స‌మంత‌కు గ‌తంలో మ‌హాన‌టి చిత్రంలో న‌టించిన సాన్నిహిత్యం ఉండ‌డంతో సామ్ కూడా సుముఖ‌త వ్య‌క్తం చేసింద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sam Viajy

Also Read: Hyderabad: చైన్​స్నాచింగ్​లో సెంచరీ కొట్టిన ఉమేష్ ఖతిక్‌ను ఎవరు విచారించాలి.. ఎక్కడ రిమాండ్ చేయాలి

రాయలసీమలో చూడాల్సిన ప్రేదేశాలు..

Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ 4 టెస్టులు చేయిస్తే బెటరంటోన్న నిపుణులు