Coronavirus: కరోనా నుంచి కోలుకున్నా అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ 4 టెస్టులు చేయిస్తే బెటరంటోన్న నిపుణులు
కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మీరు కనీసం 4 నుంచి 6 వారాల పాటు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. శరీరంలో ఏదైనా చిన్న లేదా పెద్ద సమస్య వచ్చినా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
Covid19 and Omicron Symptoms: కరోనా వైరస్ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డెల్టా వేరియంట్‌లో కరోనా బారిన పడిన ప్రజలు కోలుకున్న తర్వాత కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత కూడా, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరోనా నుంచి కోలుకుంటున్న రోగులకు అనేక ముఖ్యమైన వైద్య పరీక్షల కోసం డాక్టర్లు సలహా ఇస్తున్నారు. తద్వారా కోవిడ్ శరీరానికి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుస్తుందని అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మధుమేహం, బీపీ, గుండె లేదా మరేదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి అని అంటున్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1. యాంటీబాడీ పరీక్ష-కోవిడ్ తర్వాత, ముందుగా యాంటీబాడీ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష మీ శరీరంలో ప్రతిరోధకాలు ఏ స్థాయిలో తయారు అవుతున్నాయో చూపిస్తుంది. శరీరంలో యాంటీబాడీలు ఏర్పడటానికి ఒకటి నుంచి రెండు వారాలు పట్టవచ్చు. అందుకే కోవిడ్ తరువాత ఈ పరీక్షలు చేసుకుంటే మంచిదని అంటున్నారు.
2. సీబీసీ టెస్ట్- రెండవ పరీక్షగా సీబీసీ టెస్ట్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. సీబీసీ అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, ఇందులో ఆర్‌బీసీ, డబ్ల్యుబీసీ శరీరంలో ఎలా ఉన్నాయో తెలుస్తోంది. ఈ రెండు కణాలపై కోవిడ్ ఎలాంటి ప్రభావం చూపిందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది.
3. బ్లడ్ ప్రెషర్, షుగర్ టెస్ట్- కోవిడ్ సమయంలో చాలా సార్లు శరీరంలో రక్తం గడ్డకట్టడం, ఇన్ఫ్లమేషన్ లాంటివి పెరుగుతుంది. కాబట్టి కోవిడ్ తర్వాత శరీరంలో బ్లడ్ ప్రెజర్, గ్లూకోజ్ స్థాయిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా మధుమేహం లేదా కొలెస్ట్రాల్ సమస్య ఉంటే, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
4. కార్డియాక్ స్క్రీనింగ్- కరోనా వైరస్ శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా, ప్రజలు ఛాతీలో నొప్పి గురించి ఫిర్యాదు చేస్తే డాక్టర్ కూడా వారికి హార్ట్ టెస్ట్‌లు చేసుకోమని సలహా ఇస్తున్నారు.
5- న్యూరో ఫంక్షన్ టెస్ట్- కరోనా ఇన్ఫెక్షన్ ముగిసిన తర్వాత కొంతమందికి ఒక నెల పాటు వాసన, రుచి పొందలేక పోవచ్చు. వీటితోపాటు కరోనా ఉంటే, ఏకాగ్రత లేదా తేలికపాటి మైకం లాంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అందుకే కరోనా నుంచి కోలుకున్నాక న్యూరో ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
Omicron Variant: మీ కళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం..!