Omicron Variant: మీ కళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం..!

Health Tips: ఒమిక్రాన్ వేరియంట్‌లు సోకిన చాలా మంది రోగులలో కళ్లకు సంబంధించిన లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

Omicron Variant: మీ కళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం..!
Eye
Follow us
Venkata Chari

|

Updated on: Jan 23, 2022 | 7:33 AM

Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) దేశాన్ని గడగడలాడిస్తోంది. కరోనా(Covid-19)తోపాటు ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా లేకపోయినా.. కేసులు మాత్రం రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ సోకిన చాలా మంది రోగులలో, కళ్లకు సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. జలుబు-దగ్గు, జ్వరం, విరేచనాలు వంటి అన్ని లక్షణాలతో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్ కూడా కంటి సమస్యలను కలిగిస్తుంది. కళ్లలో ఏ లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించండి.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు.. కంటి సమస్యలు అసాధారణమైన లేదా తక్కువగా కనిపించే లక్షణాలుగా నివేదించారు. ఇది కళ్లకు సంబంధించిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉంచే ఛాన్స్ ఉండి. ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడినట్లయితే, మీ కళ్లలో గులాబీ రంగు, తెల్లగా మారడం, కనురెప్పల వాపు, కళ్ల మంటలు వంటి సమస్యలు ఉండవచ్చు. ఇది కాకుండా, కళ్ళలో ఎరుపు, మంట, నొప్పి కూడా కొత్త వేరియంట్ సంక్రమణకు సంకేతాలుగా పరిగణించారు. కొంతమంది రోగులలో అస్పష్టమైన దృష్టి, కాంతి సున్నితత్వం లేదా కళ్లల్లో నీళ్లు కూడా ఏర్పడవచ్చు.

అదే సమయంలో ఒమిక్రాన్ సోకిన రోగులలో 5 శాతం కంటి సంబంధిత సమస్యలు కనిపించాయి. అయితే, కేవలం కళ్లకు సంబంధించిన లక్షణాల ఆధారంగా, మీరు ఒమిక్రాన్ బారిన పడ్డారని చెప్పలేం. కొన్నిసార్లు కంటి సమస్యలు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి కోవిడ్ ఇతర లక్షణాల కోసం కూడా పరిగణలోకి తీసుకుని, అలాగే ఏదైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం విస్మరించకూడదు. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి సరైన చికిత్స తీసుకోవాలి.

ఈ పద్ధతులు ఉపశమనాన్ని అందిస్తాయి – కరోనా (Covid-19) సోకిన వ్యక్తులలో, కళ్ళకు సంబంధించిన లక్షణాలు కొన్నిసార్లు సాధారణమైనవిగా ఉండొచ్చు. అయితే కొంతమంది దీని కారణంగా మరింత ఇబ్బంది పడవచ్చు. అందువల్ల, శుభ్రమైన కాటన్ ప్యాడ్‌తో మీ కళ్లను తడిపి తుడవడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.

Also Read: Almond Oil Benefits: బాదం నూనెతో తళుక్కుమనే అందం మీ సొంతం.. ఇలా చేస్తే మచ్చలన్ని మటుమాయమే

Health: ఆరోగ్యానికి మంచిద‌ని వెల్లుల్లి తెగ తింటున్నారా.? ఈ స‌మ‌స్య‌లు ఎదుర్కోక‌ త‌ప్ప‌దు..