Health care tips: స్వీట్స్ తినాలంటే భయపడుతున్నారా.. వీటిని ట్రై చేయండి.. అవేంటంటే..

Health care tips:  స్వీట్స్ తినాలంటే భయపడుతున్నారా.. వీటిని ట్రై చేయండి.. అవేంటంటే..
Health Care Tips

చాలా మందికి స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే స్వీట్ తింటే బరువు పెరుగుతామని.. భయపడుతుంటారు. అంతే కాదు

Sanjay Kasula

|

Jan 23, 2022 | 7:38 AM

చాలా మందికి స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే స్వీట్ తింటే బరువు పెరుగుతామని.. భయపడుతుంటారు. అంతే కాదు చుట్టూ ఉండేవారు కూడా వెంటనే సలహా కూడా ఇస్తారు. స్వీట్స్‌కు  దూరంగా ఉండాలని.. అలాంటి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. పండుగల సీజన్‌ వచ్చిందంటే జీవితంలో జిహ్వకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలిసొస్తుంది. అంతేనా.. దాని ప్రభావం ఏమిటో అర్థం అయ్యేది అప్పుడే. రకరకాల వంటకాల ఘమఘమలు ఇల్లంతా పరుచుకోకపోతే పండుగ పరిపూర్ణం కాదని భావించని వారు ఉండరు. అందులోనూ పండగ సమయాల్లో ఇంట్లో చేసే రకరకాల పిండివంటలు చేయడం సహజం అందులో అరిసెలు, బూరెలు వంటి వాటిని పెద్ద ఎత్తున చేసుకుని పరస్పరం పంచుకోవడం సర్వసాధారణం. అయితే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాధి నిరోధక సామర్ధ్యాన్ని కాపాడుకోవడం ఇంకా అవసరం.

ఇదేలావుంటేందంటే.. పిల్లల ముందు రకరకాల చాకెట్లు పెట్టి.. తినవద్దంటే ఎంత ఇబ్బంది పడతారో  నాజూగ్గా ఉండాలనుకునే అమ్మాయిలు కూాడా ఇంట్లో స్వీట్లు చేసినప్పుడు జిహ్వను చంపుకోవడం అంతే మరి ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటప్పుడు ఏమి చేయాలంటే.. అందరిలా స్వీట్లను ప్లేటులో పెట్టుకోకూడదు. అలా కాకుండా అన్నం మామూలుగానే తినేసి, దానికితోడు స్వీట్లు కూడా లాగించేస్తే కోరి కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. కొన్ని పత్యేకమైన స్వీట్స్ తయారు చేయించుకుని తింటే బెటర్‌.  వీటిని తినడం ద్వారా బరువు పెరగకుండా స్వీట్‌ల కోరిక చాలా వరకు నెరవేరుతుంది. ఈ 5 స్నాక్స్ గురించి తెలుసుకుందాం.

బాదంపప్పుతో తేనె: తేనె ప్రత్యేకత ఏమిటంటే దీనిని తీసుకోవడం వల్ల తీపి కోరికలు తీరుతాయి. కానీ బరువు పెరగరు. అందులో నానబెట్టిన బాదంపప్పులను తిని ఆరోగ్యంగా ఉండండవచ్చు.

డ్రైఫ్రూట్స్: డ్రైఫ్రూట్స్ తినడం వల్ల వాటిలోని చక్కెర శాతం తగ్గిపోయి తినడానికి కూడా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మీకు కావాలంటే.. మీరు డ్రై ఆపిల్ చిప్స్ తినవచ్చు.

డార్క్ చాక్లెట్: బరువు తగ్గడానికి డార్క్ చాక్లెట్ ఉపయోగించవచ్చు. విశేషమేమిటంటే దీన్ని తినడం వల్ల స్వీట్స్ తినాలనే కోరిక తీరడంతోపాటు బరువు పెరిగే సమస్య కూడా ఉండదు.

పీనట్ బటర్: బాదం కుకీలను తినవచ్చు. ఈ వెన్నను సరైన మొత్తంలో తీసుకుంటే.. తీయని స్వీట్స్  కోసం మనం పడే చాలా వరకు తగ్గించవచ్చు.

వెజ్జీ చిప్స్: మీరు కావాలంటే.. వెజ్ చిప్స్‌ని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కూరగాయలను కట్ చేసి, వాటిని భాగా రోస్ట్ చేయండి. వాటిని స్నాక్స్గా తీసుకోండి. బేకింగ్ చేయడం ద్వారా అవి క్రంచీగా మారుతాయి.

ఇవి కూడా చదవండి: Jackfruit Biryani: ఈ బిర్యానీ చాలా స్పెషల్ గురూ.. పనస బిర్యానీ టేస్ట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఎలా తయారు చేయాలంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu