Jackfruit Biryani: ఈ బిర్యానీ చాలా స్పెషల్ గురూ.. పనస బిర్యానీ టేస్ట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఎలా తయారు చేయాలంటే..?
పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చని పాక శాస్త్ర నిపుణులు అంటున్నారు. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటల నుంచి పిజ్జా, బర్గర్.. ఇలా..
Jackfruit Biryani Recipe: పనస చెట్టు.. ఇదొక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు.. పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర.. ఇలా ప్రతీ భాగమూ అత్యంత విలువైనవే. దాని చుట్టూ ఉన్న మార్కెట్‌ని చూస్తే మీరుకూడా షాక్ అవుతారు. దాని సైజు కూడా భారీ ఉంటుంది. పండుపై తొక్క తీసి తొనల్ని వలవడం చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది ఇప్పటి తరం వారి అంతగా తెలియదు. పనసలో ఆరోగ్య విలువలు గుర్తించిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలు “రాష్ట్రీయ ఫలం”గా ప్రకటించాయి. మరో విషయ మీకు తెలుసా.. శ్రీలంక, బంగ్లాదేశ్ జాతీయ ఫలం కూడా పనసే.. అవును దానికి ఉండే విలువ అలాంటిది మరీ..అంతేందుకు ఈ భారీ ఫలమంటే అమెరికా, యూరప్, బ్రిటన్ దేశాల్లో ఈ పనసంటే పడి చచ్చిపోతారు.
కానీ.. పనసపండుకి పుట్టినిల్లు భారత దేశంలోని పశ్చిమ కనుమలు. పండ్లల్లో అతి పెద్దది. ఒక్కో పండు 5 నుంచి 50 కేజీల వరకు తూగుతుంది. 3 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. పనసలో ఏకంగా 300 రకాలు జాతులు ఉన్నాయి. ఉత్పత్తి అయ్యే పళ్లలో రెండేళ్ల క్రితం వరకు 80 శాతం వృథా అయ్యేవి. పనసతో 200 రకాల వంటకాలు చేయొచ్చని పాక శాస్త్ర నిపుణులు అంటున్నారు. పనసపొట్టు కూర, పసన దోసెలు వంటి సంప్రదాయ వంటల నుంచి పిజ్జా, బర్గర్.. ఇలా ఎంత చెప్పిన ఆ మెనూ చాలా పెద్దగా ఉంటుంది లేండీ.. అయితే మనం ఈ రోజు పనస బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం..
పనస బిర్యానీ చేయడానికి కావలసినవి:
పనస ముక్కలు – అర కేజీ,
నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు – 2 లవంగాలు – 2
ఏలకులు – 1
మరాఠీ మొగ్గ – చిన్నది
జాజి పువ్వు – తగినంత
ఉల్లి తరుగు – అర కప్పు
టొమాటో తరుగు – అర కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను
ఉప్పు – తగినంత
చిక్కటి కొబ్బరి పాలు – 2 కప్పులు
ఎండు కొబ్బరి తురుము – అర కప్పు
పుదీనా తరుగు – అర కప్పు
పనస బిర్యానీ తయారీ:
- స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక మసాలా దినుసులు వేసి వేయండి
- ఉల్లిని నిలువుగా తురుముకుని.. బానాలో వేయించండి. అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
- చిన్నగా కోసిన టమాటో ముక్కలను జత చేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
- పనస ముక్కలు వేసి బాగా వేయించాలి
- అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోమారు వేయించాలి
- తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి
- చిక్కటి కొబ్బరి పాలు జత చేయాలి
- పచ్చి కొబ్బరి తురుము వేయాలి
- తగినన్ని నీళ్లు పోయాలి.. పుదీనా ఆకులు వేయాలి
- బాగా కడిగిన బాసుమతి బియ్యం జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచాలి
- బాగా ఉడికిన తరవాత దింపేయాలి
మీరు కోరకునే ఘుమ ఘుమలాడే పనస బిర్యానీ రెడీ.. ఈ పనస బిర్యానీ ఒక్కసారి తింటే చాలు.. ఇక మీరు ఎన్నడు మటన్, చికన్ బిర్యానీ తినరంటే నమ్మండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. పనస బిర్యానీ ప్రిపరేషన్ మొదలుపెట్టేయండి.
ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు..
Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..