US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనకు ఏడాది పూర్తి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే..!

US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షునిగా..

US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనకు ఏడాది పూర్తి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2022 | 5:34 PM

US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జనవరి 20న ఆయన అధ్యక్షునిగా పాలన పగ్గాలు చేపట్టారు. అయితే జో బైడెన్‌ ఎన్నికలు సులభంగా ఏమి జరగలేదు. అంతా వివాదం జరిగిపోయింది. ఈ ఎన్నికల సందర్భంగా అమెరికా కాంగ్రెస్ ఉండే క్యాపిటల్ హిల్స్‌ (Capitol Hill)పై దాడి జరిగింది. తుది ఫలితాలు వెల్లడికాకముందే తానే గెలిచాని గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) ప్రకటించుకున్నారు. దీంతో అనేక ఆరోపణలు, వివాదాలు, విమర్శలు, దాడులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్‌ (White House) అడుగు పెట్టగలిగారు జో బైడెన్ (Joe Biden).

మరోవైపు అప్గాన్‌ నుంచి అమెరికా  (America)బలగాల ఉపసంహరణతో తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించడంతో జో బైడెన్‌ ప్రభుత్వం విమర్శల పాలైంది. అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన అఫ్గాన్ బలగాల ముందు తాలిబాన్లు నిలువలేరని వాదించిన జో బైడెన్ మాటలు ఆచరణలో నిజం కాలేదు.

అమెరికా చరిత్రలోనే వివాదాస్పద ఎన్నికలు:

ఇక 2016లో మొదటిసారిగా అధ్యక్ష పీఠం దక్కించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. 2020 ఎన్నికల్లో రెండో సారి అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టేందుకు ట్రంప్‌ తలపబడ్డాడు. వివాదస్పద అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న ట్ంప్‌.. ముందు నుంచే ఎన్నికలపై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగితే తప్ప తాను ఓడిపోనని చెప్పుకొచ్చాడు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్‌ ఆరోపణల మధ్య 2020 నవంబర్‌ 3న అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే తాను గెలిచాంటూ ప్రకటించుకున్నారు ట్రంప్‌. జో బైడెన్‌ గెలుపును గుర్తించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు.

క్యాపిటల్‌ హిల్‌పై దాడి..

అధ్యక్షునిగా జో బైడెన్‌ విజయాన్ని ఆమోదించేందుకు 2021 జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైంది. దీంతో ట్రంప్‌ మద్దతు దారులు దాడికి తెగబడ్డారు. అయితే ఎన్నికల్లో జోబైడెన్‌ అక్రమంగా గెలిచారంటూ ట్రంప్‌ మద్దతుదారులు భారీగా చొచ్చుకువచ్చి దాడికి పాల్పడ్డారు. భారీగా తరలివచ్చి క్యాపిటల్‌ (Capitol Hill) ను చుట్టుముట్టారు. భవనంలోకి చొచ్చుకువచ్చిన ట్రంప్‌ మద్దతుదారులు.. అద్దాలను పగులగొట్టడంతోపాటు వివాదంగా మారింది. డొనాల్డ్‌ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావాలంటూ మద్దతుదారులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ దాడిగా ప్రజాస్వామ్యంపై దాడి చాలా మంది అభివర్ణించారు. ఎట్టకేలకు ఫలితాలను అధికారికంగా ఆమోదించడంతో 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికయ్యారు.

రికార్డు స్థాయిలో ఉద్యోగాలు

జో బైడెన్‌ పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత 2021 ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు చేసుకున్నాయి. రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది బైడెన్‌ ప్రభుత్వం. రికార్డు స్థాయిలో 6.4 మిలియన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. సగటున నెలకు రూ.537,000 ఉద్యోగాలు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2017లో 2.1 మిలియన్‌ ఉద్యోగాలను భర్తీ చేశారు. అంటే మొదటి సంవత్సరంలో నెలకు 182,000 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు 2015,2016 సంవత్సరాల కంటే కొంత తక్కువగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. బైడెన్‌ 2021 జనవరిలో అధికారి చేపట్టినప్పుడు నిరుద్యోగ రేటు 6.3 డిసెంబ్‌ నాటికి ఉద్యోగ రేటు 3.9కు పడిపోయింది. అదే ట్రంప్‌ హయాంలో నిరుద్యోగ రేటు జవవరి 2017లో 4.7 నుంచి ఆ సంవత్సరం డిసెంబర్‌ నాటికి 4.1కు పడిపోయింది. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో జనవరి 2009లో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉంది. ఆ సంవ్సతరం డిసెంబరర్‌ ఇది 9.9 ఉంది. ఆర్థిక మాంద్యం గరిష్ట స్థాయి పతనం 10 శాతం తగ్గింది.

తొలి ఏడాదిలోనే ట్రంప్‌ విధానాలు రద్దు

ఇక గత అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను తొలి ఏడాదిలోనే బైడెన్‌ రివర్స్‌ చేశారు. పారిస్ క్లయిమెట్ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో చైనాకు కొమ్ము కాస్తుందంటూ ట్రంప్‌ పాలనలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటకు వచ్చిన అమెరికాను తిరిగి డబ్ల్యూహెచ్‌ఓలో చేర్చారు జో బైడెన్.

ముస్లింలపై విధించిన నిషేధం తొలగింపు:

ఇక ఇస్లామిక్‌ దేశాల నుంచి వచ్చే ముస్లింలపై విధించిన నిషేధాన్ని సైతం జో బైడెన్‌ తొలగించారు. మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి వలస వచ్చే తల్లిదండ్రుల నుంచి పిల్లలను విడతీసే పాలసీని రద్దు చేశారు ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్‌. అలాగే రాజకీయాంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు బైడెన్‌. వీగర్‌ ముస్లింల విషయంలో చైనా అణచివేతను ఆపాలంటూ బైడెన్‌ పిలుపునిచ్చారు.

కోవిడ్‌ టీకాల విషయంలో..

కరోనా మహమ్మారి విషయంలో కూడా బైడెన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనాను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. బైడెన్ మొదటి పాలనా సంవత్సరంలో కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది బైడెన్‌ ప్రభుత్వం. 75శాతం అమెరికా ప్రజలు తమ మొదటి డోసు వ్యాక్సీన్ తీసుకోగా, 63శాతం పూర్తిగా రెండు డోసుల టీకా తీసుకున్నారు. గడిచిన నవంబరు నుంచి ఐదేళ్ల నిండిన పిల్లలకు వ్యాక్సీన్ ఇస్తున్నారు. ఇక ఒమిక్రాన్ వేరియంట్‌ను అదుపు చేయడం కోసం 8 కోట్ల బూస్టర్ డోసులను ప్రవేశపెట్టారు. అటు కరోనా, ఇటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తగిన చర్యలు చేపట్టారు బైడెన్‌.

ఇవి కూడా చదవండి:

Trending News: ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్.. తిరిగి టేకాఫ్ కు నో చెప్పిన పైలెట్.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులు ఔట్!

PM Narendra Modi: నెంబర్‌వన్ లీడర్ ప్రధాని మోదీనే.. ప్రపంచ స్థాయిలో ఇంకా పెరుగుతున్న చరిష్మా..