Subhas Chandra Bose Jayanthi: నేడు పరాక్రమ దివస్.. యువతకు ప్రేరణ ఇచ్చిన నేతాజీ చెప్పిన కొన్ని కోట్స్ ను తెలుసుకుందాం..

Subhas Chandra Bose Jayanthi: నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి. ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ జయంతిని దేశ వ్యాప్తంగా 'పరాక్రమ్ దివస్'గా ఘనంగా జరుపుకుంటాం. ఈ ఏడాది నేతాజీ 125 జయంతి..

Subhas Chandra Bose Jayanthi: నేడు పరాక్రమ దివస్.. యువతకు ప్రేరణ ఇచ్చిన నేతాజీ చెప్పిన కొన్ని కోట్స్ ను తెలుసుకుందాం..
Subhasha Chandra Bose Jayanti
Follow us

|

Updated on: Jan 23, 2022 | 9:32 AM

Subhas Chandra Bose Jayanthi: నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి. ప్రతి సంవత్సరం జనవరి 23న నేతాజీ జయంతిని దేశ వ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా ఘనంగా జరుపుకుంటాం. ఈ ఏడాది నేతాజీ 125 జయంతి. దేశ రాజధాని డిల్లీలోని ఇండియా గేట్ వద్ద గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అయితే నేతాజీ విగ్రహం పూర్తయ్యే వరకు హోలోగ్రామ్ విగ్రహం కనువిందు చేయనుంది. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఈరోజు ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది నుంచి గణతంత్ర దినోత్సవ వేడుకలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రారంభమై మహాత్మా గాంధీ హత్యకు గురైన జనవరి 30న ముగుస్తాయి. సుభాష్ చంద్ర బోస్ లో స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అడుక్కోవడం కాదు అనే ఆలోచనే కాదు.. ఆయనలో ఆవేశం ఎక్కువ. ప్రతి మాటా ఓ తూటాలా ఉండడమే కాదు ప్రతి వ్యక్తిలొనూ స్వాతంత్యం కోసం పోరాడాలనే కాంక్ష రగిలించేది. ఈరోజు నేతాజీ జయంతి సందర్భంగా యువతకు ప్రేరణ ఇచ్చిన కొన్ని కోట్స్.. తెలుసుకుందాం.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోట్స్..

*మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని *స్వేచ్ఛ ఇవ్వబడలేదు – తీసుకోబడింది. *స్వాతంత్యం ఒకరు ఇచ్చేది కాదు… తీసుకునేది *ఓ ఆలోచన కోసం ఓ వ్యక్తి చనిపోతారు. ఆ వ్యక్తి మరణం తర్వాత ఆ ఆలోచన… మరింత మందిలో ప్రతిబింబిస్తుంది *ఏ సైనికులైతే తమ దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారో.. ఎప్పుడూ తమ జీవితాన్ని త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. వారు అజేయులు. *ఈ రోజు మనకు ఒక్కటే కోరిక ఉండాలి – భారతదేశం జీవించాలంటే .. మనం ప్రాణ త్యాగం చేయాలనే కోరిక * అమరవీరుడి రక్తంతో స్వేచ్ఛకు మార్గం సుగమం అవుతుంది. *చర్చల ద్వారా నిజమైన మార్పును చరిత్ర ఎప్పుడూ సాధించలేదు *అన్యాయం, తప్పుతో రాజీపడడమే అత్యంత ఘోరమైన నేరమని మర్చిపోకండి. *పోరాటం లేకపోతే జీవితం ఆసక్తిని సగం కోల్పోతుంది *మనుష్యులు, డబ్బు, వస్తువులు తమంతట తాముగా విజయాన్ని లేదా స్వేచ్ఛను తీసుకురాలేవు. *మనలో ఎవరు స్వేచ్ఛగా భారతదేశాన్ని చూడగలరన్నది ముఖ్యం కాదు. భారతదేశం స్వాతంత్ర్యం పొందుతుంది. దేశం స్వేచ్ఛ కోసం మనమంతా ప్రాణాలు అర్పిస్తే సరిపోతుంది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతికి శుభాకాంక్షలు *మన దేశ అభ్యున్నతి కోసం రోజూ పని చేద్దాం. పరాక్రమ్ దివస్ 2022 సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. *పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశానికి ప్రాణాలర్పించిన మన దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుదాం *మనం నేతాజీ సుబాస్ చంద్రబోస్‌కు నివాళులర్పిద్దాం. పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు. *భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి సెల్యూట్ చేద్దాం

Also Read:   సమంత ఊ అంటావా మామ సాంగ్ కు సౌత్ కొరియా సింగర్స్ ఫిదా.. నెట్టింట్లో వీడియో వైరల్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ