AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Song X BTS: సమంత ఊ అంటావా మామ సాంగ్ కు సౌత్ కొరియా సింగర్స్ ఫిదా.. నెట్టింట్లో వీడియో వైరల్..

Pushpa Item Song Viral: కళకు, కళాకారులకు భాషతో పనిలేదు.. కనులకు విందు చేసే నటన, మనసుకు హత్తుకునే భావం.. హృదయాలను స్పందింపజేసే సంగీతం ఉంటే చాలు ప్రపంచంలోని..

Pushpa Song X BTS: సమంత ఊ అంటావా మామ సాంగ్ కు సౌత్ కొరియా సింగర్స్ ఫిదా.. నెట్టింట్లో వీడియో వైరల్..
Bts Dances To Oo Antava Song
Surya Kala
|

Updated on: Jan 23, 2022 | 8:33 AM

Share

Pushpa Item Song  X BTS:: కళకు, కళాకారులకు భాషతో పనిలేదు.. కనులకు విందు చేసే నటన, మనసుకు హత్తుకునే భావం.. హృదయాలను స్పందింపజేసే సంగీతం ఉంటే చాలు ప్రపంచంలోని ఏ దేశంవారైనా ఆదరిస్తారు. అభిమానిస్తారు. ఒక సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాష బేధం లేకుండా సంగీతం ప్రజలను మరింత చేరువజేస్తోంది. అందులో మన తెలుగు సాంగ్స్ కూడా ఉండడం విశేషం.. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందిని అలరించిందో తెలిసిందే.. ఇప్పుడు ఈ క్రెడిట్ మళ్ళీ బన్ని మువీలోని సమంత ఊ అంటావా మావా సాంగ్ దక్కించుకుంది. ఊ అంటావా మావా అంటూ ఈ చెన్నై సోయగం చేసిన డ్యాన్స్ అనేక దేశాల వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అవును ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ స‌మంత చేసిన డ్యాన్స్‌కు కుర్ర‌కారు ఫిదా. ఈ పాట యూట్యూబ్‌లో కొన్ని వారాల్లోనే 100 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది.

బన్ని, సుకుమార్, దేవి శ్రీ కంబోలోని పుష్ప సినిమాకే ఈ సాంగ్ హైలెట్ గా నిలిచింది అని చెప్పడం అతిశయోక్తి కాదు.  స‌మంత  సాంగ్‌లో చేసిన డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్  కు  చిన్న పెద్ద అనే తేడా లేకుండా అభిమానులుగా మారిపోయారు. ఈ తెలుగు సాంగ్ క్రేజ్ దేశవిదేశాలకు చేరుకుంది. ఎల్లలు దాటి టాంజానియా , దక్షిణ కొరియా వంటి దేశాలకు చేరుకుంది. అక్కడవారు ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఫేమస్ డ్యాన్స్ గ్రూప్ బీటీఎస్ కూడా ఊ అంటావా  మావా…ఊఊ అంటావా మావా అంటూ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. బీటీఎస్ మ‌ధ్య‌లో ఉంటే టీ అంటే టాలీవుడ్ అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టింది. ఈ కొరియన్ బీటీఎస్  డ్యాన్స్ గ్రూప్ కు ఆదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులున్నారు. కరోనా నేపధ్యంలో గత కొంతకాలంగా విరామం ప్రకటించింది. అయితే తాజాగా తెలుగు సాంగ్ తో తమ ఫ్యాన్స్ కు కనుల విందు చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ తో బీటీఎస్ నెటిజన్లను తమ అభిమానులను ఓ రేంజ్ లో అలరిస్తోంది.

Also Read:  12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. వికసించిన నీలకురింజి పువ్వులు.. వీటి స్పెషాలిటీ ఏమిటో తెలుసా..