Telangana: వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది మాత్రం నీచపు క్రీడ

మత్తును మాయగా స్మగ్లింగ్ చేస్తున్నారు. అస్సలు అనుమానం రాకుండా బోర్డర్ దాటించేస్తున్నారు. తాజాగా అలాంటి ఉదంతమే వెలుగుచూసింది.

Telangana: వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది మాత్రం నీచపు క్రీడ
Liquor Smuggling
Follow us

|

Updated on: Dec 02, 2021 | 12:33 PM

మత్తును మాయగా స్మగ్లింగ్ చేస్తున్నారు. అస్సలు అనుమానం రాకుండా బోర్డర్ దాటించేస్తున్నారు. స్మగ్లింగ్ కోసం కేటుగాళ్లు వేస్తున్న వేషాలు పోలీసులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు మతి పోయేలా, మైండ్ బ్లాంక్ అయ్యేలా గంజాయి రవాణా అవ్వడం మనం చూశాం. ఇప్పుడు నాటు సారా వంతు వచ్చింది. ఇందుకోసం కిలాడీలు గొప్ప వేషమే కట్టారు.

‘వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది సారా సరఫరా’..  అవును పోలీసుల నుంచి తప్పించుకోడానికి జరుగుతున్న కొత్త తరహా స్మగ్లింగ్ విధానం ఇది. ఈ సారా కిక్కు ఏకంగా రాష్ట్రాలు రాష్ట్రాలే దాటుతోంది. చత్తీస్‌గడ్ అడవుల్లో తయారైన నాటుసారాని ములుగు జిల్లాలో విక్రయానికి తెచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు. ఎవరికీ అనుమానం రాకుండా, పోలీసులు ఆపకుండా ఉండేందుకు హనుమాన్ మాలలు వేసుకుని తరలింపు మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో వాజేడు మండలంలోని పేరూరు పోలీసులు వాళ్లను పట్టుకున్నారు. హనుమాన్ అంటే ఎంతో పవిత్రత. ఆంజనేయుడి మాల వేస్తే ఎప్పుడూ భక్తి పారవశ్యంలో ఉండాలి. చిన్న తప్పు కూడా చేయకూడదు. అలాంటి హనుమాన్ మాల దుస్తులతో వీరు చేస్తోన్న పాపపు పనులపై ఆధ్యాత్మిక వేత్తలు ఫైర్ అవుతున్నారు.

Also Read: Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర

వీరికి అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే.. ఏం పేరు పెడతారో మీరే డిసైడ్ చెయ్యండి