AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife Kidnaped: తాళి కట్టిన భార్యనే స్నేహితులతో కలిసి కిడ్నాప్.. అసలు విషయం తెలిస్తే షాక్!

ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు.. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి కిడ్నాప్ చేశాడు.

Wife Kidnaped: తాళి కట్టిన భార్యనే స్నేహితులతో కలిసి కిడ్నాప్.. అసలు విషయం తెలిస్తే షాక్!
Kidnap
Balaraju Goud
|

Updated on: Dec 02, 2021 | 12:25 PM

Share

Man kidnaped his Wife: ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు.. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్యను తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లాలో వెలుగుచూసింది. గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన దామల్ల సుధాకర్‌, రజిని దంపతులు వృత్తి రీత్యా హనుమకొండలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు శాంతి హైదరాబాద్‌లో బీఎస్సీ నర్సింగ్‌ చేస్తోంది. సెలవులకు ఇంటికి వచ్చిన సమయంలో భూపాలపల్లి జిల్లా స్తంభంపల్లికి చెందిన బాలరాజుతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో గత ఏప్రిల్‌లో రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత వారి కాపురంలో కలతలు రావడంతో శాంతి పుట్టింటికి వెళ్లిపోయింది.

పుట్టింటికి వెళ్లిన శాంతి కాపురానికి రాకపోవడంతో పలుమార్లు బాలరాజు భార్యపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె ససేమిరా అన్నడంతో బాలరాజు కోపంతో రగిలిపోయాడు. ఎలాగైన భార్యను తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం జిల్లా ముత్తుగూడెం గ్రామంలోని శాంతి అమ్మమ్మ ఇంట్లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు సుధాకర్‌ కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు తన స్నేహితులతో శాంతిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఖమ్మం జిల్లా రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కిడ్నాప్‌ కేసు కూడా నమోదైంది. కొన్ని రోజుల తర్వాత భర్త ఇంటి నుంచి తప్పించుకొని శాంతి పుట్టింటికి చేరుకుంది. నర్సింగ్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత పెద్దలతో మాట్లాడి పంపిస్తామమని ఆమె తల్లిదండ్రులు బాలరాజుకు నచ్చజెప్పారు.

తాజాగా బుధవారం కుటుంబసభ్యులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న శాంతిని బాలరాజు అడ్డగించాడు. స్నేహితులతో కలిసి రెండు కార్లలో వచ్చిన అతడు అత్త రజిని, బావమరిది సృజన్‌ను పక్కకు నేట్టేసి కార్‌లో తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో శాంతి తల్లి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read Also… Whatsapp: ఫోన్ నెంబర్‌ సేవ్‌ చేసుకోక పోయినా వాట్సాప్‌లో చాటింగ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..