Viral news: మూగజీవిపై అమానుషం.. కుమారుడిని కరిచిందని శునకాన్ని కర్కశంగా హతమార్చిన వైనం..

శునకాలను విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరుగా భావిస్తారు. అందుకే వాటిని చాలామంది కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అలాంటిది ఆ మూగజీవి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు..

Viral news: మూగజీవిపై అమానుషం.. కుమారుడిని కరిచిందని శునకాన్ని కర్కశంగా హతమార్చిన వైనం..
Follow us
Basha Shek

|

Updated on: Dec 02, 2021 | 1:44 PM

శునకాలను విశ్వాసానికి, నమ్మకానికి మారుపేరుగా భావిస్తారు. అందుకే వాటిని చాలామంది కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అలాంటిది ఆ మూగజీవి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. కుమారుడిని గాయపరిచిందన్న కోపంతో ఓ శునకాన్ని దారుణంగా హతమర్చాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లా సిమారియతల్‌ గ్రామంలో ఇటీవల ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. కాగా ఇది కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సాగర్‌ విశ్వాస్‌ అనే వ్యక్తి శునకాన్ని పెద్ద ఇనుప రాడ్‌తో చితక బాదడం.. నొప్పితో కుక్క విలవిల్లాడుతుంది. అయినా కనికరించని ఆ వ్యక్తి ఓ పదునైన కత్తితో మూగజీవి కాలిని కోస్తాడు.

కాగా ఈ వీడియోను చూసిన పీపుల్‌ ఫర్‌ ది ఎథికట్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) కార్యకర్తలు సాగర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూగజీవిని కర్కశంగా హతమార్చిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా పెటా కార్యకర్త ఛాయా తోమర్‌ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి 429 (మూగజీవాలను చంపడం, విష ప్రయోగం చేయడం, హింసించడం), యానిమల్స్‌ యాక్ట్‌ కింద పలు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు త్వరలోనే నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Also read:

Telangana: వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది మాత్రం నీచపు క్రీడ

Wife Kidnaped: తాళి కట్టిన భార్యనే స్నేహితులతో కలిసి కిడ్నాప్.. అసలు విషయం తెలిస్తే షాక్!

Crime News: కృష్ణా జిల్లాలో మారణాయుధాలతో ముసుగు దొంగల హల్ చల్.. CCTV కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..