AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: కృష్ణా జిల్లాలో మారణాయుధాలతో ముసుగు దొంగల హల్ చల్.. CCTV కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు..

ఏపీలోని కృష్ణా జిల్లా గుంటుపల్లిలో ఓ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. మొత్తం ఐదుగురు అగంతకులు మారణాయుధాలతో అర్ధరాత్రి నల్లూరి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు

Crime News: కృష్ణా జిల్లాలో మారణాయుధాలతో ముసుగు దొంగల హల్ చల్.. CCTV కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు..
Basha Shek
|

Updated on: Dec 02, 2021 | 11:42 AM

Share

ఏపీలోని కృష్ణా జిల్లా గుంటుపల్లిలో ఓ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. మొత్తం ఐదుగురు అగంతకులు మారణాయుధాలతో అర్ధరాత్రి నల్లూరి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో ఉండే ఇళ్లలోకి దూరి దొంగతనానికి ప్రయత్నించారు. అయితే ఇంటి తలుపులు పగలగొట్టే శబ్ధాలు విని అపార్ట్‌మెంట్‌ వాసులు నిద్రలేచారు. అప్రమత్తమై లైట్లు వేయడంతో దొంగల ముఠా భయంతో అక్కడి నుంచి పరారైంది. సమాచారం అందుకున్న పోలీసులు నల్లూరి అపార్ట్‌మెంట్‌కు చేరుకుని దొంగలు పగలగొట్టేందుకు ప్రయత్నించిన ఇళ్ల తలుపులను పరిశీలించారు. అనంతరం అపార్ట్‌మెంట్‌ వాసులతో మాట్లాడి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా ఈ దొంగల ముఠా దోపిడీకి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్‌లో ఉండే సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని చూస్తుంటే మొత్తం ఐదుగురు అగంతకులు ముసుగులు ధరించి మారణాయుధాలతో అపార్ట్‌మెంట్లోకి వచ్చారని తెలుస్తోంది. వీరి వేషధారణ, ఆయుధాలను చూసి నగరంలోకి చెడ్డీ గ్యాంగ్‌ ప్రవేశించిందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా సోమవారం విజయవాడలో కూడా ఇలాంటి దోపిడీ ఒకటి జరిగింది. కొందరు దోపిడీ దొంగలు చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్దగల అపార్ట్ మెంట్లోకి ప్రవేశించి మొదటి అంతస్తులోని ఓ ఇంట్లో తలుపు పగలగొట్టి బంగారంతో పాటు నగదును దోచుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Also Read:

Man Lost Wife in gambling: యూపీలో అమానుషం.. జూదంలో భార్యను ఓడిన భర్త.. తిరిగి వచ్చేసిందని ట్రిపుల్ తలాక్!

సభ్యసమాజం తలదించుకునే మహిళా టీచర్ ప్రవర్తన.. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపులు

Shilpa Chowdary: ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న కిలాడి లేడి శిల్పా చౌదరి లీలలు.. తాజా లిస్టులో ప్రముఖ సినీ ఫ్యామిలీ!