AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Lost Wife in gambling: యూపీలో అమానుషం.. జూదంలో భార్యను ఓడిన భర్త.. తిరిగి వచ్చేసిందని ట్రిపుల్ తలాక్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. బల్లియా ప్రాంతంలో జరిగిన ఓ అవమానకరమైన సంఘటన అలస్యంగా బయటకు వచ్చింది.

Man Lost Wife in gambling: యూపీలో అమానుషం.. జూదంలో భార్యను ఓడిన భర్త.. తిరిగి వచ్చేసిందని ట్రిపుల్ తలాక్!
Triple Talaq
Balaraju Goud
|

Updated on: Dec 02, 2021 | 10:41 AM

Share

Uttar Pradesh Man Lost Wife in gambling: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. బల్లియా ప్రాంతంలో జరిగిన ఓ అవమానకరమైన సంఘటన అలస్యంగా బయటకు వచ్చింది. జూదం బెట్టింగ్‌లో ఓ భర్త తన భార్యను కోల్పోయాడు. ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు ఇవ్వనందుకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. జరిగిన దారుణానికి బలైన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ అత్తారింటి ముందే ఆందోళనకు దిగింది. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని బాధితురాలు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. డీఎం కార్యాలయం నుంచి సమాచారం అందిందని, ఘటనా స్థలానికి బృందాన్ని పంపి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు.

బల్లియా ప్రాంతంలోని మనియార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోర్కెండ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగ్రా ప్రాంతానికి చెందిన తస్మిన్ షేక్ 1992 సంవత్సరంలో షాహీన్ అఫ్రోజ్‌ను వివాహం చేసుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యను డబ్బుల కోసం వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో భార్యను తీసుకుని ఢిల్లీ వెళ్లాడు. డబ్బు కోసం తన భార్యను జూదం ఆడించాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. డబ్బు కోసం జూదంలో తనను భర్త ఓడిపోయి ఢిల్లీ నుంచి పారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తోంది. ఎలాగోలా బాధితురాలు బల్లియాలోని తన తల్లి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో జూదంలో ఓడిపోయినందుకు డబ్బులు చెల్లించాలని భర్త డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటి వేశాడని ఆమె జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై చర్చలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది బాధితురాలు.

Read Also…  AP CM YS Jagan: తుఫాన్ కారణంగా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు.. ఉత్తరాంధ్ర సమీక్షలో సీఎం జగన్ ఆదేశం!

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..