Viral Video: వీరికి అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే.. ఏం పేరు పెడతారో మీరే డిసైడ్ చెయ్యండి

నడపడానికి బైక్.. అందులో పెట్రోల్ ఉంటే ఎంత దూరమైనా రయ్ రయ్ మంటూ వెళ్లొచ్చు. దారిలో బైక్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా.. ఇక రిపేర్ షాపుకు వెళ్లేంతవరకు టార్చర్ ఉంటుంది.

Viral Video: వీరికి అవార్డ్ అయితే ఇవ్వాల్సిందే.. ఏం పేరు పెడతారో మీరే డిసైడ్ చెయ్యండి
Viral Photo
Follow us

|

Updated on: Dec 02, 2021 | 11:39 AM

నడపడానికి బైక్.. అందులో పెట్రోల్ ఉంటే ఎంత దూరమైనా రయ్ రయ్ మంటూ వెళ్లొచ్చు. దారిలో బైక్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా.. ఇక రిపేర్ షాపుకు వెళ్లేంతవరకు తోసుకుంటూ వెళ్లడానికి ఆపసోపాలు పడాల్సి వస్తుంది. తాజాగా ఓ వ్యక్తికి ఇదే తరహా ఇబ్బంది ఎదురింది. బైక్ కిక్ రాడ్ ఇరిగిపోయింది. స్టార్ట్ చేద్దామంటే వీలు కుదరలేదు. దీంతో బైక్ యజమానికి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన బైక్ లాక్కెళ్లడానికి సైకిల్ సాయం తీసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. రోడ్డు మీద బైక్‌ను.. సైకిల్ లాగుతూ వెళ్లడాన్ని అందరూ ఆశ్చర్యంగా చూశారు.

కుక్కునూరు మండలం జిన్నాల గూడెంలో ఈ ఇన్సిడెంట్ చూసిన కొందరు వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలు చిత్రీకరించారు. అటవీ ప్రాంతం జున్నాల గూడెంకి చెందిన ఆదివాసి తెగకు చెందిన వ్యక్తి ఈవిధంగా ప్రయాణం చేశాడు. అయితే విషయం తెలియని చాలా మంది పెట్రోల్ ధరలు పెరగటంతో ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారేమో అనుకున్నారు. అయితే కారణం తెలిసిన వాళ్లు మాత్రం అతగాడి తెలివికి నవ్వుకున్నారు. వాహనాలు ట్రబుల్ ఇస్తే.. ఇంజన్ సహాయంతో నడిచే మరో వాహనం లాగటం సాధారణంగా జరుగుతుంది. అయితే  బైక్‌‌ను లాగేంత స్పీడ్‌గా. బలంగా సైకిల్‌ ముందుకు తొక్కడం మాములు విషయం కాదు. గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఆ బైక్‌పై ఓ వ్యక్తి కూడా కూర్చున్నాడు. అయితే సైకిల్ తొక్కే కుర్రాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరా.. గిరా తొక్కడం మాత్రం చూపరులను ఆకర్షించింది. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర

Viral Video: ఈ డాగ్ భలే తుంటరి అబ్బా.. అప్పటివరకు నీరు పట్టింది.. అంతలోనే..

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..