Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ డాగ్ భలే తుంటరి అబ్బా.. అప్పటివరకు నీరు పట్టింది.. అంతలోనే..

విశ్వాసం ఉన్న జంతువు ఏది అని అడగ్గానే వెంటనే శునకం అని మారు మాట్లాడకుండా చెబుతారు. ప్రేమగా చూసుకుంటే కుక్క చాలా విశ్వాసం చూపిస్తుంది.

Viral Video: ఈ డాగ్ భలే తుంటరి అబ్బా.. అప్పటివరకు నీరు పట్టింది.. అంతలోనే..
Dog Funny Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2021 | 10:22 AM

విశ్వాసం ఉన్న జంతువు ఏది అని అడగ్గానే వెంటనే శునకం అని మారు మాట్లాడకుండా చెబుతారు. ప్రేమగా చూసుకుంటే కుక్క ఎంత విశ్వాసం చూపిస్తుందో.. తెలియజేసే ఘటనలు ఇప్పటికే ఎన్నో చూశాం. చాలాసార్లు అవి ప్రాణాలను కూడా త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే పెట్ డాగ్స్‌కు చాలా మంది చాలా లవ్వింగ్‌గా చూసుకుంటారు. ఇక శునకాలకు సంబంధించిన వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో ఆ వీడియోలను జనాలు బాగా లైక్ చేస్తారు. వాటిలో కొన్ని చూడటానికి ఆహ్లదంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో తెగ సర్కులేట్ అవుతుంది.

చాలా మందికి శునకాలను పెంచడం చాలా ఇష్టం. అన్ని సమయాల్లో వాటిని పక్కనే ఉంచుకుంటారు. తినేటప్పడు, పడుకునేటప్పుడు కూడా వాటినే తమ వద్దే ఉంచుకుంటారు. అందుకే పెట్ డాగ్స్ కూడా చాలా విధేయతను చూపుతాయి. కానీ, కొన్ని సార్లు అవి చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతారు.

వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వ్యక్తి స్నానం చేస్తుండగా.. పెట్ డాగ్  టేబుల్‌పై హాయిగా నిలబడి అతడి తలపై ట్యాప్ పట్టి నీరు పోస్తుండటం మీరు చూడవచ్చు. అయితే అనూహ్యంగా నీరు ఆపేసిన కుక్క.. యూరిన్ పాస్ చేసింది.  ఈ వీడియోను చాలామంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు. ఫన్నీ.. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Akhanda Review: బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్.. థియేటర్లలో మాస్ జాతర

సభ్యసమాజం తలదించుకునే మహిళా టీచర్ ప్రవర్తన.. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై లైంగిక వేధింపులు